Bhadradri Kothagudem: ఆర్ఎంపీ వైద్యునికి రూ.50వేల ఆర్థిక సాయం చేసిన డాక్టర్ క్రిష్ణ కిషోర్

Bhadradri Kothagudem: ఆర్ఎంపీ వైద్యునికి రూ.50వేల ఆర్థిక సాయం చేసిన డాక్టర్ క్రిష్ణ కిషోర్

Bhadradri Kothagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, కిక్ టుడే : మణుగూరు మండలానికి  చెందిన ఆర్ఎంపీ వైద్యుడు సత్యనారాయణ కు ఖమ్మం అపెక్స్ హాస్పిటల్ యూరాలజిస్ట్ జనరల్ సర్జన్ డాక్టర్ కృష్ణ కిషోర్ ఖమ్మం లోని తన హాస్పిటల్ ఛాంబర్ లో రూ.50వేల  ఆర్థిక సహకారాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. గత 40 సంవత్సరాలుగా వైద్య వృత్తినే పరమావధిగా భావించి గ్రామీణ ప్రాంతాల్లో విశిష్ట సేవలు అదించిన సత్యనారాయణ తన ఆరోగ్యం బాగోలేక, ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులలో అపెక్స్ హాస్పిటల్ డాక్టర్ కృష్ణ కిషోర్ ఆర్థిక సహకారం అందించారని ఆనందం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా, అపెక్స్ డాక్టర్ కృష్ణ కిషోర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. గతంలో గ్రామీణ వైద్యుల సహాయక సంఘం  మణుగూరు పట్టణంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కృష్ణ కిషోర్ ఆర్ఎంపీ వైద్యులు కే సత్యనారాయణ పరిస్థితి తెలుసుకొని తన వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తానని మాట ఇచ్చి, అనతి కాలంలోనే తిరిగి ఆర్ఎంపి వైద్యునికి  రూ.50వేల ఆర్థిక ఆర్థిక సహకారం అందించినందుకు గ్రామీణ వైద్యుల సహాయక సంఘం రాష్ట్ర నాయకులు పాలాది మహేష్, మణుగూరు మండల అధ్యక్షులు తోకల వెంకటేశ్వరరావు, తుంగల రవి కృతజ్ఞతలు తెలిపారు.

Read Also కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?