సివిల్స్ మెయిన్స్ ర్యాంక్ లో మెరిసిన నల్ల మల యువకులు 

సివిల్స్ మెయిన్స్ ర్యాంక్ లో మెరిసిన నల్ల మల యువకులు 

అచ్చంపేట, ఏప్రిల్ 22,(క్విక్ టు డే న్యూస్):-
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతం అమ్రాబాద్ మండలంమన్ననూరు గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మండలి సాయికిరణ్ అనే యువకుడుమంగళవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ప్రతిభను కనపరిచి మట్టిలో మాణిక్యం లాగా ఐఏఎస్ కు ఎంపిక కావడం హర్షించదగిన విషయం. నేడు ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 298 ర్యాంకు సాధించి ఐఏఎస్ కు వచ్చిన ర్యాంక్ కన్ఫామ్ కావడంతోతల్లిదండ్రులు మండలి పుష్పమ్మ, తండ్రి మండలిలింగమయ్యకొల్లాపూర్,నియోజకవర్గంలోనిపెద్దకొత్తపల్లిమండలఎంపీఓసంతోషానికి అవధులు లేవు. వారితోపాటుకుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, అచ్చంపేట నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడిపాలమూరు జిల్లాలోని దళిత సామాజిక వర్గానికి చెందినఒకయువకుడు సివిల్స్ లో రాణించడం ఇదే మొదటితరుణమనిపలువురుచర్చించుకుంటూసంతోషంవ్యక్తంచేస్తున్నారు. అంతకంటే ఎక్కువగాగ్రామస్తులుకాలనీవాసులుకొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అనే విధంగా చదువుతే ఇలా చదవాలని పలువురుఅభినందనలవర్షంకురిపిస్తున్నారుహైదరాబాదులో ఎడ్మిట్ ప్రైవేటుకళాశాలలో డిగ్రీ చేస్తున్నప్పుడే.. సివిల్స్,సాధించాలనే తపన మొదలు కావడంతో ప్రిపేర్ అవుతూ మల్లారెడ్డి కళాశాలలో ఎంబీఏ చదువుతూనే దృష్టి పెట్టానని, ఆ క్రమంలోనే ఒక సంవత్సరం పాటు ఆన్లైన్ ద్వారా ఇంటి దగ్గర ఉండి శిక్షణ తీసుకొని సివిల్స్ పరీక్షలకు సన్నద్ధంఅయ్యానని తెలిపాడు. మొదటిప్రయత్నంలోనే 298వ ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు.అచ్చంపేట నియోజక వర్గంలోని వంగూర్ మండలంతిప్పారెడ్డి పల్లి గ్రామానికి చెందినగోకమోళ్లఆంజనేయులుమంగళవారం విడుదల చేసిన సివిల్స్ ఫైనల్ ఫలితాల్లో 934 ర్యాంకు సాధించి ఎఐఆర్ సర్వీస్ సాధించారు. ఒక నిరుపేదకుటుంబంలోపుట్టినఆంజనేయులు కష్టపడి చదివిఆల్ఇండియా సివిల్ సర్వీస్ ర్యాంకుసాధించడం పట్ల తిప్పారెడ్డిపల్లి  గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆంజనేయులు గ్రామంలోనియువతకుఆదర్శంగానిలిచారనిప్రశంసించారు.

IMG-20250422-WA0030

Read Also ఇంటర్ మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు సాధించిన కుమ్మరి వంశీ..అభినందించిన ఎమ్మెల్యే

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?