రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.....
గతంలో వయస్సు పైబడిన వారు మాత్రమే రక్తపోటు సమస్యను ఎదుర్కొనే వారిని, ప్రస్తుతం యుక్త వయస్సు వారు సైతం బాధితులుగా మారుతున్నారన్నారు. శారీరక శ్రమ తగ్గడం, ఉరుకుల పరుగుల జీవితం, ఆహార అలవాట్లు, అధికంగా ఉప్పు తీసుకోవడం, కొవ్వు పదార్థాలు భుజించడం, ఎక్కువ సమయం కూర్చునే జీవనశైలి, మద్యపానం వంటి అనేక అంశాలు రక్తపోటుకు కారణం అవుతాయన్నారు. శారీరక వ్యాయామం, బరువుకు తగిన స్థాయిలో నీరు తీసుకోవాలని తెలిపారు.
కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు మీరాజ్, ప్రియాంక, నందన, మానస, డీ పీ ఎం ఓ వనాకర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.