MLA Beerla Ilaiah: సరస్వతి మాతను పూజిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
On
MLA Birla Ilaiah : యాదాద్రి భువనగిరి, క్విక్ టుడే : సరస్వతి మాతను పూజిస్తే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సరస్వతి అమ్మవారి విగ్రహా ప్రతిష్టా కార్యక్రమంలో సరస్వతి అమ్మవారి విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అమ్మవారికి దండా, పట్టు చీర, నైవేద్యం సమర్పించారు.
Read Also ఆకేపోగు ప్రమోద్ కు 'దళిత రత్న' అవార్డు
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. వాక్ బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటిన్నింటికీ సరస్వతి దేవిని ఆది దేవతగా పూజిస్తామన్నారు. హిందూ దేవత మూర్తులలో సరస్వతి దేవిని చదువుల తల్లిగా ఆరాధిస్తామని అన్నారు. విద్యార్థులంతా మంచి చదువులు చదివి ఉన్నతస్థాయికి వెళ్లాలని కోరుకున్నారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
Read Also ఆర్థిక సాయం అందజేత
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...