చలో వరంగల్ వ‌జ్రోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి

చలో వరంగల్ వ‌జ్రోత్స‌వ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాలి

బోడుప్ప‌ల్‌, ఏప్రిల్ 26 (క్విక్ టుడే న్యూస్‌):-వరంగల్ లోని ఎల్క‌తుర్తిలో ఆదివారం నిర్వ‌హించే చలో వరంగల్ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొ రేషన్  అధ్యక్షులు మంద సంజీవరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. ఆదివారం బోడుప్ప‌ల్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ఏప్రిల్ 27న చలో వరంగల్, భారీ బహుబలి సభకి పెద్ద ఎత్తున విచ్చేయాల‌ని కోరారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్నిక‌ల్లో ఇచ్చిన‌ 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింద‌ని, వాటి వైఫల్యాలను ప్రజలకు మరింత అర్థమయ్యేలా కేసీఆర్ నాయకత్వంలో వరంగల్ సభకి బోడుప్పల్ నుంచి జనం భారీగా తరలి వెళ్ళనున్నారని, ఉదయం 9 గంటలకి 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, పార్టీ కార్యాల‌యం వ‌ద్ద జెండా ఎగురవేసి స‌భ‌కు బ‌య‌లుదేర‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.  ఈ కార్యక్రమంలో బోడుప్పల్ నగరపాలక మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ, సీనియర్ నాయకులు కొత్త రవి గౌడ్,  తదితరులు పాల్గొన్నారు.

IMG-20250426-WA0021

Read Also గంగమ్మ తల్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?