Collector Gautham : పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా చేతివృత్తుల వారికి చేయుత

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా  కలెక్టర్ గౌతమ్

Collector Gautham : పీఎం విశ్వకర్మ స్కీం ద్వారా చేతివృత్తుల వారికి చేయుత


 
Collector Gautham  : మేడ్చ‌ల్ క‌లెక్ట‌రేట్‌, క్విక్ టుడే :  కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన జిల్లాలోని బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం సోమవారం నిర్వహించారు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ  సమీక్షా సమావేశంలో  కలెక్టర్ మాట్లాడుతూ 18 రకాల చేతి వృత్తుల వారికీ పి ఎం విశ్వకర్మ స్కీం ద్వారా ఆర్థిక సహాయం అందించడం ద్వారా అంతరించి పోతున్న హస్త కళలకు జీవం పోసినట్టు అవుతుందన్నారు. ఈ స్కీం కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డులు జత చేసి  గ్రామ పంచాయతీలో  దరఖాస్తు చేసుకోవాలన్నారు. వాటిని జిల్లా స్థాయి లో దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రాష్ట్ర స్థాయి లో గుర్తింపు కార్డు అందజేయడం జరుగుతుందన్నారు.

గుర్తింపు కార్డు పొందిన వారికీ అవసరమైన ఉపకరణాలు  పి ఎం విశ్వకర్మ స్కీం ద్వారా మొదటి విడతగా 50 వేలు అందజేస్తారు, తదుపరి అవసరమైన మేరకు లక్ష నుండి రెండు లక్షల వరకు ఋణం ఇవ్వడం జరుగుతుందన్నారు. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక లక్ష్యం 18370  కోట్లు కాగా, 44287 కోట్లు మంజూరు చేసి 241 శాతం తో లక్ష్యాన్ని అధిగమించారన్నారు.   లక్ష్య సాధనలో వెనుకబడిన బ్యాంకర్లు తమ పనితీరును మెరుగు పరచుకోవాలన్నారు.   పట్టాన ప్రాంతమైన మేడ్చల్ జిల్లాలో యువతకు  ఉన్నత విద్యా కై ఎక్కువ శాతం రుణాలు అందించడం ద్వారా యువత ఉన్నత విద్యా ప్రమాణాలను పొంది వారి బంగారు భవిష్యత్తు కు మైలు రాయి అవుతుందన్నారు.  రైతులకు పంట రుణాలు, టర్మ్ లోన్ లు, వ్యవసాయ అనుబంధ రుణాలు విరివిగా అందించాలని సూచించారు. ఎస్సి,ఎస్టీ,బిసి, మైనారిటీ , పరిశ్రమలు, డిఆర్ డిఓ  తదితర  శాఖల ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు  ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ నిర్మాణం, ఇతర ప్రాధాన్యత  రంగాలకు   అర్హులైన పేద లబ్దిదారులకు మంజూరు చేయాలనీ కోరారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవగాహన కలిగిస్తూ విరివిగా రుణాలు అందించాలని కోరారు.  ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిర్ణిత గడువులోగా రుణాలు మంజూరు చేయాలనీ అన్నారు.బ్యాంకులో దరఖాస్తులు

Read Also శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

పెండింగులో లేకుండా చూసుకోవాలని, తిరస్కరణకు గురైన వాటిని పరిశీలించి తగు రీతిలో బ్యాంకులు పంపాలని అధికారులకు సూచించారు. ప్రతి నెలకొకసారి లేనిచో రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా బ్యాంకర్స్ బెనిఫిషరీ మీటింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కోరినారు.  స్వయం సహాయక సంఘాల రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వన్ టైం సెట్టిల్మెంట్ పై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆర్ధిక అక్షరాస్యత, నగదు రహిత డిజిటల్ లావాదేవీలపై అవగాహనా కలిగించాలని బ్యాంకర్లకు సూచించారు. ఈ సమావేశంలో కెనరా బ్యాంకు డిజిఎం సంజయ్ కుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు, ఆర్బిఐ ఎల్ డి ఓ గోమతి , నాబార్డ్ అధికారి  రమేష్, జి ఎం డి ఐ సి రవీందర్,  జిల్లా వ్యవసాయాధికారిణి మేరీ  రేఖ, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి, , ఆయా బ్యాంకుల మేనేజర్లు, డీఆర్డీవో పద్మజ రాణి, మెప్మా, ఎస్సీ కార్పొరేషన్, డీఐసీ, కేవీఐసీ, ఆర్బీఐ, నాబార్డుతో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భ ట్టి విక్రమార్క

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?