వీరజవాన్ మురళి నాయక్ కు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళి

వీరజవాన్ మురళి నాయక్ కు కాంగ్రెస్ పార్టీ ఘన నివాళి

మిర్యాలగూడ, మే 10 (క్విక్ టుడే న్యూస్):- దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళి నాయక్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గాంధీ విగ్రహం నుండి అమరవీరుల స్థూపం  వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డిలు పాల్గొని మురళి నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కేతవత్ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ  పాకిస్తాన్ తో జరుగుతున్న యుద్ధంలో, విరోచితంగా పోరాడుతూ వీరమరణం పొందిన గిరిజన బిడ్డ మురళి నాయక్ త్యాగం మరువలేనిది అని అన్నారు. వారి ఆశయ సాధన కోసం  పనిచేయాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో అమాయక ప్రజల పై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల పై ఉక్కు పాదం మోపాలని కోరారు. ఉగ్రవాద పాకిస్తాన్ దేశానికి యుద్ధంలో భారత్ తగిన గుణపాఠం చెప్పిందని అన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీపీలు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెసు పార్టీ నాయకులు, ఎంపీటీసీ, బ్లాక్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, కిసాన్ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250510-WA0041

Read Also ప్రభుత్వ ఆస్తులు కరిగిపోతే మాకేంటి? ఇదీ పరవాడ రెవెన్యూ అధికారుల తీరు!.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?