ఏప్రిల్ 24 న జిల్లా సదస్సును జయప్రదం చేయండి..

ఏప్రిల్ 24 న జిల్లా సదస్సును జయప్రదం చేయండి..

తొర్రూరు ఏప్రిల్ 20:- కేంద్రంలోని బీజేపీ మోడీ సర్కార్ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 24న జిల్లా కేంద్రంలో జరుగు సదస్సును జయప్రదం చేయాలని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు హోమ బిక్షపతి అన్నారు. ఏఐటిసి, సిఐటియు, టియుసిఐ తొర్రూర్ డివిజన్ జాయింట్ సమావేశం తొర్రూర్ లోని ఆర్ అండ్ బిగెస్ట్ హౌస్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో బిక్షపతి మాట్లాడుతూ...మహబూబాబాద్ లోని పెరుమాండ్ల జగన్నాథం భవన్లో కార్మిక సంఘాల ఐక్య జిల్లా సదస్సు జరగనుందని అన్నారు. 

ఈ సదస్సుకు జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల నుండి అన్ని వర్గాల కార్మికులు హాజరుకానున్నారని ఆయా సంఘాల రాష్ట్ర బాధ్యులు ముఖ్య వక్తలుగా వస్తారని ఆయన తెలిపారు. మోడీ సర్కార్ కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్ కంపెనీల కనుక్కునంగా తమ విధానాల రూపొందిస్తుందని నాలుగు లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఉద్యమించాలని అన్నారు. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాక సదస్సు కు కార్మిక వర్గం అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని టియుసిఐ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవి కోరారు. సిఐటియు మండల కార్యదర్శి జమ్మల శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఘనపురం లక్ష్మణ్, టియుసిఐ తోరూర్ ఏరియా కమిటీ అధ్యక్షులు శ్రీరాం పుల్లయ్య, వెంకన్న, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Read Also జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాలకు నోటిఫికేషన్

IMG-20250420-WA0100

Read Also ఉగ్రవాదాన్ని అంతమొందించాలి.. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?