ఎంసిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి 

ఎంసిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి 

కేసముద్రం, మే 08 (క్విక్ టుడే న్యూస్):- వరంగల్ లో ఈనెల 26 నుంచి 28 వరకు నిర్వహించే ఎంసిపిఐ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఎంసిపిఐ మండల కార్యదర్శి మర్రిపెల్లి మొగిలి కోరారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని సబ్ స్టేషన్ తండాలో గురువారం ఆ పార్టీ జెండాను ఎంసిపిఐ గ్రామ కార్యదర్శి బానోత్ సుగిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంసిపిఐ మండల కార్యదర్శి మర్రిపెల్లి మొగిలి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర పాలన సాగిస్తున్న పార్టీలు వేరువేరు అయినప్పటికీ అనుసరిస్తున్న విధానాలు మాత్రం ప్రజా వ్యతిరేక విధానాలని దుయ్యబట్టారు. జాతీయ సంపదలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం వారు దోచుకోవడం జరుగుతుందని ఆరోపించారు. ప్రజా పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ప్రజా పోరాటాల కార్యాచరణను అనుసరించేందుకు నిర్వహించే రాష్ట్ర కమిటీ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు జాటోత్ బిచ్చ నాయక్, బానోతు సరోజ, వాంకడోత్ శ్రీను, గూగులోత్ సోనా తదితరులు పాల్గొన్నారు.

IMG-20250508-WA0017

Read Also అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?