కేసిఆర్ పేరు తొలగింపు పై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

కేసిఆర్ పేరు తొలగింపు పై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, మే 02 (క్విక్ టుడే న్యూస్):- మిర్యాలగూడ నియోజకవర్గ కేంద్రం, టౌన్ నడిబొడ్డున 10కోట్ల రూపాయలతో బి.ఆర్.యస్ పాలనలో కేసీఆర్ కళాభారతి ని నిర్మించారు. ఈ కేసిఆర్ కళాభారతిని మిర్యాలగూడ నియోజకవర్గ కవులు, కళాకారులు, రచయితలు, సాంస్కృతిక పరులకు అంకితం చేస్తూ వారి కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెంట్రల్ ఏ/సి తో నిర్మించి ఇచ్చారు. ఇట్టి కెసిఆర్ కళాభారతి పేరులో కేసీఆర్ పేరును స్థానిక పాలకుల సూచనతో మున్సిపల్ సిబ్బంది తొలగించడం జరిగింది. ఈ విషయం పై భగ్గు బారాస శ్రేణులు మాజీ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యములో అదే కెసిఆర్ కళాభారతి వద్ద బైఠాయించి భారీ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2006 లో శంకుస్థాపన చేసిన కేసీఆర్ కళాభారతిని ఎమ్మెల్యే గా ఎన్నికైన నాటి నుంచి దీని పై ధృష్టి పెట్టి పలుమార్లు కెసిఆర్ ని, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి మన ప్రాంత కళాకారుల పరిస్థితిని వివరించి, పూర్తిగా నిర్మాణం చేపట్టి 2023 అక్టోబర్ 2న కేటీఆర్ మరియు అప్పటి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. కాగా ప్రభుత్వం మారినక ప్రస్తుత పాలకులు చేయవలసిన అభివృద్ది పనుల పై ధృష్టి పెట్టకుండా కూల్చుడు, పేర్లు మార్చుడు పై ఆలోచిస్తున్నారు. నేను పదేళ్ళు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఏనాడైన ఎటువంటి చర్యలకు పాల్పడలేదని, ప్రజలకు ఏం కావాలో అది చేసే వారే నాయకులు తప్ప ఇబ్బంది పెట్టె వారు కాదని తెలుసుకోవాలని సూచించారు. దాదాపు 973 కోట్ల రూపాయలు నా హయాంలో మంజూరు చేసి టెండర్లు పిలిచి ఉన్నవి, వాటిని పూర్తి చేస్తే చాలని, ఇంకా మిర్యాలగూడ కు ఏం వద్దని హితవు పలికారు. వాటిని సంపూర్ణంగా వాడుకోకుండా అన్నీ నిధులు క్యాన్సిల్ చేసుకుంటూ పోతే పక్క నియోజకవర్గం వారు తీసుకెళ్తుంటే చూస్తూ ఉండడం తప్ప వీళ్ళు ఏమి చేయలేక పోతున్నారని ప్రస్తుత పాలకులను ఉద్దేశించి చెప్పారు. ఆనాడు కెసిఆర్ యాదాద్రి థర్మల్ ప్లాంటు లో 573 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, అదే కాకుండా ఒక వెయ్యి మందికి అవుట్ సోర్సింగ్ రూపంలోనో, ఇతర మార్గం ద్వారా ఉద్యోగం కల్పిస్తామని చెప్పారని, కానీ ఈ పాలకులు హడావిడిగా 116 మందికి ఉద్యోగాలు ఇప్పించి మిగతా వారిని వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం, సబ్ కలెక్టర్ కార్యాలయం, డిఎస్పీ కార్యాలయాల నందు మెమోరాండం ఇచ్చి బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని, మరలా యధావిధిగా పేరు అమర్చాలని కోరారు. కార్యక్రమములో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, దుర్గంపూడి నారాయణ రెడ్డి, యడవెల్లి శ్రీనివాస రెడ్డి, ఎం.డి. మోషీన్ అలీ, ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, ధనావత్ బాలాజీ నాయక్, పాలుట్ల బాబయ్య, మట్టపల్లి సైదయ్య యాదవ్, ఎం.డి. మాక్ధూమ్ పాషా, అంగోతు హాతీరాం నాయక్, ఎం.డి. ఇలియాస్ ఖాన్, చిర్ర మల్లయ్య యాదవ్, రాములు గౌడ్, కుర్రా చైతన్య, మహిళా విభాగం నాయకురాళ్ళు పెండ్యాల పద్మ, షెహనాజ్ బేగం, కొదటి రమా, ధనమ్మ, ఉమా, ఎం.డి. షోయబ్, ఒగ్గు జానయ్య, బారాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250502-WA0113

Read Also వరంగల్ లో జరిగే సన్మాన సభను విజయవంతం చేయండి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?