అంటరానితనం పై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు

అంటరానితనం పై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు

మిర్యాలగూడ, ఏప్రిల్ 14 (క్విక్ టుడే న్యూస్):- నీరుడు శివ ఆధ్వర్యంలో గోగువారిగూడెం గ్రామంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షులు ముద్దం నాగరాజు, మండల అధ్యక్షులు నామ అశోక్, తాజా మాజీ సర్పంచ్ దాములూరి రంగారావు, కార్యదర్శి జగదీష్, సందీప్, తేజ, అనిల్, పవన్, మహేష్, పూరం జాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ అధ్యక్షులు ముద్దం నాగరాజు మాట్లాడుతూ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా, ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుంది. అంటరానితనం పై ఆయన పూరించిన సమరశంఖం నేటికీ ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతూనే ఉంది. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన. కుల, మత, రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్‌ తన జీవితకాలం పోరాటం చేశారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్‌ చేసిన పోరాటం మరువలేనిది. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవ్వరు ఎదుర్కోకూడదని, అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవి వివరించారు.

IMG-20250414-WA0098

Read Also వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?