తెలుగు వృత్త్యంతర శిక్షణలో జ్ఞాన దర్శిని పుస్తక సమీక్ష

తెలుగు వృత్త్యంతర శిక్షణలో జ్ఞాన దర్శిని పుస్తక సమీక్ష

వనపర్తి, మే 24 (క్విక్ టుడే న్యూస్):-వనపర్తి జిల్లా కేంద్రంలో బాలికోన్నత పాఠశాలలో భాషోపాధ్యాయుల వృత్త్యంతర శిక్షణలో

గ్రామ చరిత్ర బడి గుడి సంస్కృతి సాంప్రదాయాల పై జ్ఞాన దర్శిని పేరుతో ఎల్లూరు పాఠశాల ప్లాటినం జూబ్లీ సంచికను తీసుకు రావడంలో కృషి చేసినందుకుగాను తెలుగు భాషోపాధ్యాయుల ఆధ్వర్యంలో పుస్తక సంపాదకులు కంటె నిరంజనయ్యను ఘనంగా సన్మానించారు.IMG-20250524-WA0018 ఈ కార్యక్రమంలో పుస్తక సమీక్షకులు డా.తూర్పింటి నరేశ్  మాట్లాడుతూ..." ఒక గ్రామ పుస్తకాన్ని ప్రచురించడంలో ఉండే ప్రయాసలను అధిగమించి  పుస్తకాన్ని అందంగా ఆకర్షణీయంగా చరిత్ర ఆధారాలతో ఇతర గ్రామాలకు స్ఫూర్తిని అందించే విధంగా ఉందని.. కొల్లాపూర్ సురభి రాజుల పాలనను.. .క్రీ.శ 1840 లో జటప్రోలు నుండి కొల్లాపూర్ కు రాజధానిని మార్చిన విషయాన్ని, లక్ష్మణరావు హయాంలో జరిగిన *ఎల్లూరు లడాయిని*...పూర్వం కొలుముల పల్లె గా ...కమ్మరులు కొలుములు నడిపేవారని...అగస్తేశ్వరం..సోమేశ్వరం దేవాలయాలను ఎల్లోజు... మల్లోజు... సోమోజులు  నిర్మించారని... .పెద్దవాడెైన ఎల్లోజు పేరున ఎల్లూరును నిర్మించారని .. కొల్లాపూర్ ప్రాంతంలో క్రీ..శ.. 1905 నాటికే సుసంపన్న రాజ్యమనీ... ఈ ప్రాంత రాజులు ఏరోప్లేన్స్ నడిపేవారని.... ప్రస్తుతమున్న జఫర్ మెైదానాన్ని ఏరోడ్రమ్ గా ఉపయోగించారని అలనాటి కొల్లాపూర్ చరిత్రను కళ్లకు కట్టినట్లు వీక్షకుల యవనికపెై సజీవ సాక్ష్యంగా ముందుంచారు.  ఊరుపేరును ఇంటి పేరుగా మార్చుకున్న ఎల్లూరు నరసింగకవి గురించి చక్కగా వివరించారు. రాచకన్యకా పరిణయం. ప్రబంధం గురించి... మాధవరాయల చంద్రికా పరిణయం గురించి ..." తెల్పారు. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా  స్టేట్ ఆర్జెడి ఏడి శ్రీమతి అనసూయ, మరియు కోర్సు డైరెక్టర్ శ్రీమతి ఉమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి ఏఎమ్ఓ మహానంది
 నిర్వాహకులు పయ్యావుల కృష్ణయ్య, సువర్ణ , రమణమ్మ , పార్వతి , చెన్న పద్మ ,రాజా రెడ్డి , డాక్టర్ తూర్పింటి నరేశ్ కుమార్, షావుకారి శాంతన్న,రూప్ అధ్యక్షులు 
సుధాకరాచారి   ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Read Also వ‌ర్షాకాలంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..అధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?