జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాలకు నోటిఫికేషన్

జ్యోతిబాపూలే బీసీ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాలకు నోటిఫికేషన్

తొర్రూరు ఏప్రిల్ 23(క్విక్ టుడే న్యూస్):- మండలంలోని నాంచారిమడుర్ గ్రామంలోని నవోదయ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించబడుతున్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల (పురుషులు) డిగ్రీ కళాశాలల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎ. హరిప్రసాద్  ఒక ప్రకటనలో తెలిపారు.బుధవారం ఆయన మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, డిగ్రీ కోర్సులు పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో నేర్పబడతాయని తెలిపారు. బిఎస్సి,బిజెడ్ సి,బిజెడ్ జి, ఎంపీజి , ఎమ్మెస్సీఎస్ , బిటిబి సిసి, ఎంబీజడ్ సి,బీకాం కంప్యూటర్, బిబిఏ, బిఏ(హెచ్ఈపి)ప్రవేశానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష ఉండదని, నేరుగా అర్హులైన అభ్యర్థులు వారికి నచ్చిన కోర్సులో చేరవచ్చని పేర్కొన్నారు.ఈ కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందం,నాణ్యమైన బోధన,ఉచిత వసతి సదుపాయం,ఆధునిక ల్యాబ్స్,కంప్యూటర్ ల్యాబ్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని వెల్లడించారు.

ప్రవేశాలు ఈనెల 24 నుండి ప్రారంభం కానునట్టు తెలిపారు.
అర్హత కలిగిన పురుష అభ్యర్థులు కళాశాలను నేరుగా సంప్రదించి అడ్మిషన్ పొందగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉపేందర్, పిడి స్రవంతి, అధ్యాపకులు రేవ్ల నాయక్, నరేష్, జానయ్య, అరుణ జ్యోతి, సురేందర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Read Also ఉద్యోగానికే విర‌మ‌ణ‌.. వ‌య‌స్సుకు కాదు:- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి 

IMG-20250423-WA0045

Read Also శ్రీ రాగా స్కూల్ వార్షిక పరీక్షల ఫలితాల సందడి.. ముఖ్యఅతిథిగా హాజ‌రైన‌ మల్లవరపు వరప్రసాద్, కవిత

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?