కూచిపూడి నాట్యంలో రాణిస్తున్న మోక్షదృతి
On
కూచిపూడి నాట్యాన్ని అద్భుతంగా చేసి అందరిని మెప్పించిన కళాకారిణి మోక్షదృతి అభినందనీయురాలని యక్షగాన కంఠీరవ, ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యులు పసుమర్తి శేషుబాబు తెలిపారు. ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్ ఎఫ్ సీ నగర్ కు చెందిన మోక్షదృతి నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రపంచ నృత్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన స్పూర్తి నేషనల్ డాన్స్ ఫెస్ట్-2025 కార్యక్రమంలో కూచిపూడి నృత్య కళాకారిని మోక్షదృతి పాల్గొని అత్యంత ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమే తల్లిదండ్రులు దోసపాటి శంకర్, ప్రవర్తి లను కూడ అభినందించి శాలువాలు, పుష్పగిచ్చాలతో సన్మానించారు. నాట్య కళాకారిణి మోక్షదృతిని ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యులు డాక్టర్ పసుమర్తి శేషుబాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. అకుంఠిత దీక్ష, పట్టుదలతో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సాధించాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, నృత్యాచార్యులు, నాట్య గురువులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Read Also ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...