ఇంటర్ మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు సాధించిన కుమ్మరి వంశీ..అభినందించిన ఎమ్మెల్యే

ఇంటర్ మీడియట్ ఫలితాలలో రాష్ట్రస్థాయి 4వ ర్యాంకు సాధించిన కుమ్మరి వంశీ..అభినందించిన ఎమ్మెల్యే

మిర్యాలగూడ, ఏప్రిల్ 23 (క్విక్ టుడే న్యూస్):- స్థానిక మిర్యాలగూడ పట్టణంలో వాసవినగర్ నందు ఎస్వి మోడల్ హై స్కూల్ నందు నర్సరీ నుంచి పదో తరగతి వరకు చదివిన విద్యార్థి కుమ్మరి వంశి మంగళవారం నాడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించడం జరిగింది. మిర్యాలగూడ పట్టణ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వంశి ని సన్మానించి స్వీట్స్ తినిపియడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వంశి చదువులో రాణించాలని, ఇట్టి విజయానికి సహకరించిన పాఠశాల బృందానికి మరియు వంశి కి వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ మా ఎస్వి మోడల్ హై స్కూల్  చదువుకున్న విద్యార్థులు సాఫ్ట్ వేర్, బ్యాంకు, పోస్టలు డిపార్ట్మెంట్లో వివిధ రంగాలలో మంచి ఉద్యోగాలు సాధించి మంచి పేరు సంపాదించుకుంటున్నారు. ఇట్టి విద్యార్థుల విజయాలకి తోడుపడుతున్న పాఠశాల ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపిసి మాశెట్టి శ్రీనివాస్, పాఠశాల డైరెక్టర్ ఓరుగంటి విశాలాక్ష్మి, ఇంచార్జ్ నాగలక్ష్మి పాల్గొన్నారు.

IMG-20250423-WA0032

Read Also నవవిధ భక్తికి ప్రతీకగా శ్రీ సాయిబాబా అనుగ్రహించిన తొమ్మిది నాణేలు – జూన్ 5న దర్శన భాగ్యం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?