ఘనంగా ఎఐసిటియు ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

ఘనంగా ఎఐసిటియు ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

కేసముద్రం మే 01(క్విక్ టుడే న్యూస్):- అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా ఎంసిపిఐ అనుబంధ ఎఐసిటియు ఆధ్వర్యంలో కేసముద్రంలో గురువారం మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పూలే సెంటర్లో పార్టీ జెండాను ఎంసిపిఐ పార్టీ మండల కార్యదర్శి మరిపెళ్లి మొగిలి,  కార్మిక సంఘం జెండాను ఎఐసిటియు జిల్లా అధ్యక్షురాలు ఇరుప ప్రియాంక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంసిపిఐ పార్టీ మండల కార్యదర్శి మర్రిపెల్లి మొగిలి మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో కార్మికుల ప్రాణ త్యాగంతోనే మేడే ఆవిర్భవించిందని తెలిపారు. ఆనాడు 10 గంటల పని రద్దుచేసి 8 గంటల పని విధానం కోసం పోరాటాలు చేసి ప్రాణాలోదిలారని అని తెలిపారు. ప్రస్తుత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏళ్ల తరబడి కార్మికులు సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ పెట్టుబడిదారీ వర్గాలకు మద్దతుగా నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని అన్నారు. నాలుగు లేబర్ కోడ్ ల విధానంతో కార్మికుల హక్కులన్నీ హరించి వేస్తూ మళ్ళీ శతాబ్దాల కాలం నాటి పరిస్థితులు ఏర్పడుతూ కార్మికులు శ్రమదోపిడికి గురికావాల్సివస్తుందని ఆరోపించారు. మే డే స్ఫూర్తితో కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో  పార్టీ నాయకులు జాటోత్ బిచ్యా నాయక్, దయ్యాల కుమారస్వామి,  కొనతం రాంచందర్, సపావత్ లింభానాయక్, వాంకుడోత్ మొగిలి, వాంకుడోత్ శ్రీను, కేసముద్రం విలేజ్ గ్రామ పార్టీ కార్యదర్శి ఉల్లి ప్రతాప్, అమీనాపురం గ్రామ పార్టీ కార్యదర్శి రమ, సుశీల తదితరులు పాల్గొన్నారు.

IMG-20250501-WA0094

Read Also ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందజేత 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?