మేడిపల్లి, మే 11 (క్విక్ టుడే న్యూస్):-మేడిపల్లి లయన్స్ క్లబ్ జిల్లాలోని నంబర్ వన్ గా ఎదగాలని డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం మేడిపల్లి లాండ్స్ క్లబ్ ను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. క్లబ్బుకు సంబంధించిన అకౌంట్ వివరాలు సక్రమంగా ఉన్నాయంటూ అభినందించారు. ఇకనుంచి కూడా అందరూ ఇలాగే కలిసి క్లబ్బును మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు. లయన్స్ క్లబ్ సర్వసభ్య సమావేశంలో అందరూ పాల్గొని తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి డి జి లయన్ సుధాకర్ రెడ్డి, లయన్ కన్నా పరుశరాములు, గైడింగ్ లయన్ కృష్ణజీవన్ బజాజ్, వైస్ గవర్నర్ లయన్ హరికిషన్ రెడ్డి, లయన్ పజ్జురి జయహరి, గోల్డెన్ జూబ్లీ జనగామ క్లబ్ అధ్యక్షులు లయన్ సంజీవరెడ్డి, లయన్ మర్యాద అశోక్, లయన్ ప్రసాద్, మేడిపల్లి ల్యాండ్స్ క్లబ్ అధ్యక్షులు వేముల కేశవనాదం గౌడ్, జనరల్ సెక్రటరీ లయన్ పల్లె బాలరాజ్ గౌడ్, లయన్ సావిత్రి, ,లయన్ లావణ్య, లయన్ శారద, లయన్ చందన, లయన్ మహేందర్ రావు, లయన్ రాజు, లయన్ మహేష్, లైన్ ప్రభాకర్, లయన్ చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లయన్ అధ్యక్షులు వేముల కేశవనాదం గౌడ్ జన్మదినo ఘనంగా జరుపుకున్నారు.
