తల్లి లాంటి బాధ్యత ఆశా కార్యకర్తలది : డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సుధీర్ రెడ్డి

తల్లి లాంటి బాధ్యత ఆశా కార్యకర్తలది : డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సుధీర్ రెడ్డి

తొర్రూరు మే 06(క్విక్ టుడే న్యూస్):- తల్లి లాంటి బాధ్యత ఆశా కార్యకర్తలదని డిప్యూటీ డీఎంహెచ్ ఓ డాక్టర్ సుధీర్ రెడ్డి తెలిపారు.  మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు.తొర్రూరు ఏరియా ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు, మండల వైద్యాధికారి డాక్టర్ జ్వలితతో కలిసి డిప్యూటీ డిఎంహెచ్వో మాట్లాడారు.ప్రతి మహిళా ప్రసవం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా ఆశా కార్యకర్తలు చొరవ తీసుకోవాలన్నారు.గర్భిణులు,బాలింతలు,శిశువులకు గడువులోగా వైద్యం అందేలా చూడాలన్నారు. మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక ఓ వ్యాధిగ్రస్తులకు నెలవారి మాత్రలు విధిగా అందించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వచ్చే అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు వంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్యం అందించేందుకు ఆశా కార్యకర్తలు చొరవ చూపాలన్నారు. గ్రామాల్లో వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.దోమల నివారణకు ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేసేలా పంచాయతీలు, మున్సిపాలిటీ అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ మీరాజ్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మానస, డాక్టర్ నందన, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20250506-WA0042

Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?