ఎంపియుపిఎస్ ముల్కలకాల్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రగతి పత్రాల అందజేత 

ఎంపియుపిఎస్ ముల్కలకాల్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రగతి పత్రాల అందజేత 

మిర్యాలగూడ, ఏప్రిల్ 23 (క్విక్ టుడే న్యూస్):- ముల్కలకాల్వ ఎంపియుపిఎస్ పాఠశాలలో జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడిలోని సదుపాయాలను వివరించడం జరిగింది. దీనికి తల్లిదండ్రుల నుండి సానుకూల స్పందన రావడం జరిగింది. అనంతరం పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించినటువంటి ప్రగతిని వివరిస్తూ, తల్లిదండ్రులకు ప్రగతి పత్రాలను అందివ్వడం జరిగింది. అనంతరం ఆరో తరగతి విద్యార్థులు ఏడో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటుచేసి సాంస్కృతిక కృత్యాలు, డాన్సులు ద్వారా వారికి వీడ్కోలు పలకడం జరిగింది. ఈ విద్యా సంవత్సరమును ముగిస్తూ వేసవి సెలవుల్లో విద్యార్థులు తీసుకోవలసిన జాగ్రత్తలను తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఉపాధ్యాయులు నాగులు, మక్బూల్ అహ్మద్, రామ్మోహన్, సంతోష్ కుమార్, అనురాధ మేడం, విద్యార్థిని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

IMG-20250423-WA0040(1)

Read Also గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?