Komatireddy Venkatareddy : నల్లగొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddy Venkatareddy : నల్లగొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా



Komatireddy Venkatareddy :  న‌ల్ల‌గొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంతోపాటు, నల్గొండ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ బైపాస్ రోడ్  వద్ద 55 కోట్ల రూపాయల వ్యయంతో  విలీన గ్రామాలలో నిర్మించనున్న సిసి రోడ్లు, మురుగు  కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఎన్జీ కాలేజీ వద్ద కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న  హెల్త్ అండ్ హైజిన్ స్ట్రీట్ ఫుడ్ కోర్టు పనులకు శంకుస్థాపన చేశారు.     నల్గొండ జిల్లా అభివృద్ధికి అనేక పనులను చేపట్టినట్లు వెల్లడించారు.  నల్గొండ మున్సిపాలిటీని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం అన్నారు. తాగునీరు, శానిటేషన్, గ్రీనరీపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారించాలిఅన్నారు. విలీన గ్రామాలలో 55 కోట్ల టిఎఫ్ ఐ డి సి నిధులతో నిర్మించనున్న డ్రైన్లు, సిసి రోడ్ల పనులకు నల్గొండ బైపాస్ రోడ్డులో శంకుస్థాపన చేశారు.

పట్టణం తోపాటు చుట్టుపక్కల 326 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. నల్గొండ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతాం అన్నారు.600 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అవుటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నాము అన్నారు. 6 లైన్ల  ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ రహదారి పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం అన్నారు.  నల్గొండ పట్టణ ప్రజలకు తాగునీరు, వినియోగించుకునే నీటికి ఇబ్బంది లేకుండా 10లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన 2 వాటర్ ట్యాంక్ లను చేపట్టాం అన్నారు.20 కోట్ల రూపాయలతో  నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నాము అన్నారు. కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న హెల్త్ అండ్ హైజిన్ ఫుడ్ స్ట్రీట్ పనులకు ఎన్జీ కళాశాల వద్ద మంత్రి శంకుస్థాపన చేశారు. 2000 మందికి భోజనం అందించే ఏర్పాటు చేశారు.  

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

హరే రామ హరే కృష్ణసహకారంతో అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా నార్కెట్ పల్లి లో 25 వేల మంది కూలీలు, విద్యార్థులు, పని చేసుకునే వారికి రూ. 5 కే భోజనం అందించే ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో ప్రారంభానికి చర్యలు చేపడతామన్నారు. రోడ్లు, డ్రైన్ల  పనుల నాణ్యత విషయంలో ఇంజనీరింగ్ అధికారులు రాజీ పడొద్దు మంత్రి  ఆదేశించారు. మహాత్మాగాంధీయూనివర్సిటీలో ఖాళీలను భర్తీ చేస్తాం అన్నారు.ఇటీవల నిర్వహించిన జాబ్ మేళాకు 12,000 మంది హాజరుకాగా, 6000 మందికి ఉద్యోగాలు ఇచ్చాము అన్నారు. మే, జాబ్  నెలలో మరో జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాం అని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, ఆర్ అండ్ బి ఎస్ ఈ రాజేశ్వర్ రెడ్డి ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read Also యూత్ లీడర్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రేయోభిలాషులతో ఎంఈఓ సమావేశం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?