వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లితండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి:- కూం‌డ్రపు కృష్ణంనాయుడు

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లితండ్రులు అప్ర‌మ‌త్తంగా ఉండాలి:- కూం‌డ్రపు కృష్ణంనాయుడు

విశాఖ ఉమ్మడి జిల్లా బ్యూరో(క్విక్ న్యూస్):-అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కేంద్రమైన.వాడ చీపురుపల్లి నాయుడుపాలెం గ్రామం ఉన్న ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కూం‌డ్రపు కృష్ణంనాయుడు శుక్రవారం ప్రకటనలో సూచించారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తమ తల్లిదండ్రులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలని ఎండాకాలం స్కూలు సెలవు దినంల‌లో పిల్లలు తమ గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్న, చెరువుల్లో నూతల్లో ఈతల కొట్టడానికి తల్లి తండ్రి తెలియకుండానే వెళ్ళిపోతారు. అందుకనే ముందుగానే  తగు జాగ్రత్తలు పిల్లలపై తీసుకోవాలని , అవసరమైతే భద్రత ఏర్పాట్లు కలిగిన స్విమ్మింగ్ పూల్ తీసుకువెళ్లి పిల్లలు కోరిక తీర్చాలని అన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున సాధ్యమైనంత వరకు పగటిపూట పిల్లలను బయటకు పంపవద్దని, తప్పనిసరైతే వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని  పేర్కొన్నారు. వేసవి సెలవులు వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే దిశగా పిల్లలకు మార్గనిర్దేశం చేయాలని కృష్ణంనాయుడు తెలిపారు. వినోదంతో విజ్ఞానం పెంపొందించడానికి పిల్లల అభీష్టం మేరకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సంప్రదాయ నృత్యాలు, చదరంగం, స్విమ్మింగ్ వంటి వాటిలో శిక్షణ ఇప్పించాలని. పిల్లల్లో దాగివున్న వ్యక్తిగత నైపుణ్యాలను వెలికితీసేందుకు కూడా వేసవి సెలవులు దోహదం చేస్తాయని, ఆ దిశగా తల్లిదండ్రులు దృష్టి సారించాలని అని ఉత్తరాంధ్ర బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు కూండ్రపు కృష్ణం నాయుడు కోరారు.

IMG-20250425-WA0059

Read Also ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి జర్నలిస్టులు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?