రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి... పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వాములు కావాలి... పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి

తొర్రూరు ఏప్రిల్ 29(క్విక్ టుడే న్యూస్):- భారత రాజ్యాంగ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మంగళవారం ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో మండలంలోని కర్కాల నుండి హరిపిరాల గ్రామ వరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహ సమావేశం నిర్వహించి పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా "జై బాపు, జై భీమ్" కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గొప్ప రాజ్యాంగమని, దానిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని గుర్తు చేశారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చేతిలో గాంధీ అంబేద్కర్ చిత్రపటం పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, దేవేందర్ రెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, ప్రసాద్ రెడ్డి,రామచంద్రయ్య, సురేందర్ రెడ్డి,అచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి,శ్రావణ్ కుమార్,చెవిటి సధాకర్,యాకూబ్ రెడ్డి,ధరావత్ సోమన్న, రవి నాయక్, ఫింగిలి ఉష, ప్రశాంతి, వెంకట్ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250429-WA0033

Read Also దేశం లో గర్వింగా భావించే ఇందిరా సౌర గిరిజన వికాస పథకం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?