జాగ్రత్తలతోనే వడదెబ్బ నుంచి రక్షణ*

జాగ్రత్తలతోనే వడదెబ్బ నుంచి రక్షణ*

తొర్రూరు ఏప్రిల్ 22:- జాగ్రత్తలతోనే వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చని డీఎం హెచ్ఓ భూక్య రవి రాథోడ్ అన్నారు. మంగళవారం డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్వో మాట్లాడుతూ......వడదెబ్బ తాకిన వారికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన వైద్యం అందించేందుకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఓ ఆర్ ఎస్ ద్రావణాలు ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. వడదెబ్బ బారిన పడగానే చికిత్స అందించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. తీవ్రంగా ఎండలు ఉన్న సమయంలో బాలింతలు , చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్ళవద్దని సూచించారు.ఆరోగ్య సిబ్బంది విధులకు విధిగా హాజరుకావాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటించాలని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్యాలను అధిగమించేలా అందరూ కష్టపడి పని చేయాలన్నారు.ట్రూ నాట్ మిషన్లను పరిశీలించి దానికి సంబంధించిన సామాగ్రిని వెంటనే కొనుగోలు చేయాలని వైద్యాధికారి జ్వలితను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జ్వలిత, వైద్యులు మీరాజ్ ప్రియాంక, నందన, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుసుమ విద్యాసాగర్, డిపిఎమ్ఓ వనాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20250422-WA0027

Read Also భూభారతి తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?