రోడ్డు కబ్జాను అడ్డుకోండి.. హైడ్రా ఆధికారులకు ఫిర్యాదు చేసిన సాయి నగర్ కాలనీవాసులు

రోడ్డు కబ్జాను అడ్డుకోండి.. హైడ్రా ఆధికారులకు ఫిర్యాదు చేసిన సాయి నగర్ కాలనీవాసులు

మేడిపల్లి, మే 1 (క్విక్ టుడే న్యూస్):- పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి సర్వేనెంబర్ 29, 30 సాయి నగర్ కాలనీ లో వరంగల్ హైవే నుండి కాలనీ లోనికి వచ్చే మున్సిపాలిటీ ముప్పై ఫీట్ల రోడ్డు గత 30 సంవత్సరాల నుండి ఉంది ఈ రోడ్డును చూపించి కాలనీలో పలు అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగింది ఈ రోడ్డును చూసి కాలనీలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేశారు ఈ రోడ్డుపై నిత్యం సుమారు వంద కుటుంబాలు ప్రయాణం కొనసాగిస్తారు ఈ రోడ్డులో మున్సిపల్ కార్పొరేషన్ వారు వేసిన డ్రైనేజీ పైపులైను, కరెంటు లైన్, వాటర్ లైన్ ఉంది.  ఒకతను తమ ప్లాటని కబ్జా చేసి రోడ్డుకు అడ్డంగా బేస్మెంట్ నిర్మాణం చేస్తున్నాడు. వెంటనే కాలనీవాసులు అందరూ కలిసి దానిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు లిఖితపూర్వకంగా మరియు హైడ్రా కమిషనర్ కు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి కబ్జా గురైన ప్రాంతానికి విచ్చేశారు వారి వెంట మున్సిపల్ అధికారులు కూడా వచ్చారు. కాలనీవాసులు వారి వద్ద ఉన్న పత్రాలు హైడ్రా అధికారికి చూపించి రోడ్డు కబ్జాకు గురికాకుండా కాపాడాలని కోరారు రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న బేస్మెంట్ ను తొలగించాలని వేడుకున్నారు. వారు సమస్య పరిష్కారం అయ్యే విధంగా చేస్తామని తెలిపారని కాలనీవాసులు పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ప్రవీణ్ రాథోడ్, జైపాల్ రెడ్డి, యుగంధర్ రావు,  సోమయ్య, వెంకటేశ్వరరావు, సత్తిరెడ్డి, బుచ్చిరెడ్డి, వెంకటా చారి, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

IMG-20250501-WA0084

Read Also వ‌ర్షాకాలంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..అధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?