స్కాలర్ షిప్స్ ప్రభుత్వం పెట్టె భిక్ష కాదు.. విద్యార్థుల హ‌క్కు

స్కాలర్ షిప్స్ ప్రభుత్వం పెట్టె భిక్ష కాదు.. విద్యార్థుల హ‌క్కు

ఏబీవీపీ నల్లగొండ జిల్లా కన్వీన‌ర్ ఆవుల సంపత్
గడియారం చౌరస్తా వద్ద  విద్యార్థుల నిరసన

నల్లగొండ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ న‌ల్ల‌గొండ‌ జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ డిమాండ్ చేశారు. సోమవారం ఏబీవీపీ నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక గడియారం చౌరస్తా వద్ద విద్యార్థిని విద్యార్థులు అంతా భారీ ర్యాలీగా వచ్చి నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా కన్వినర్ ఆవుల సంపత్ మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ విడుదల చేయని కారణంగా దాదాపు 7,500 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయన్నారు. 

నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటుతున్న పెండింగ్ బకాయిలను చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తూ పేద విద్యార్థుల జీవితాల పట్ల శాపంగా మారిందని మండిపడ్డారు. పేద విద్యార్థులకు సంజీవని వంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థుల హక్కు అయినటువంటి రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకపోవడం అనేది సిగ్గుచేటు అని అన్నారు,

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే దిశగా ప్రభుత్వం కుట్ర చేస్తుంది అన్నారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పూర్తిచేసిన వేలమంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాని కారణంగా యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే కానీ సర్టిఫికెట్స్ ఇవ్వమంటూ విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తుంటే విద్యార్థులు మానసికంగా ఇబ్బందికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం బాధాకరం, ఒకవైపు రియంబర్స్మెంటు బకాయిలు చెల్లిస్తే తప్ప మేము కళాశాలను నడపలేని స్థితిలో ఉన్నామని ప్రైవేటు యాజమాన్యాలు మొర పెట్టుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని మండి పడ్డారు.

Read Also ఆకేపోగు ప్రమోద్ కు 'దళిత రత్న' అవార్డు 

 తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్స్ మరియు స్కాలర్ షిప్స్ విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులందరినీ కలుపుకొని మంత్రులను,ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సింధు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మౌనేశ్వర్ చారి, నగర కార్యదర్శి గట్టి గొర్ల శివకృష్ణ,నగర సంయుక్త కార్యదర్శులు చందు, శివ, విగ్నేష్, నగర ఉపాధ్యక్షులు శివాజీ, హరి, క్రాంతి జోనల్ ఇంచార్జ్ లు వేణు, శివమని మరియు గణేష్, ఆకాష్, ఉదయ్ గౌతమ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Read Also దేశం లో గర్వింగా భావించే ఇందిరా సౌర గిరిజన వికాస పథకం

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?