ఉమాశంకర్ గుప్తాకు సామాజిక సేవరత్న అవార్డు

ఉమాశంకర్ గుప్తాకు సామాజిక సేవరత్న అవార్డు

మేడిపల్లి, ఏప్రిల్ 21(క్విక్ టుడే న్యూస్‌):-రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన సమావేశంలో పలువురు సామాజిక సేవకులకు హెన్ఆర్పీఎస్ సేవారత్న, ప్రతిభా రత్న అవార్డుల బహూకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రిటైర్డ్ జిల్లా జడ్జి, సుప్రీం కోర్టు న్యాయవాది నేరెళ్ల మల్యాద్రి, హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ చైర్మన్ కొంపల్లి సత్యనారాయణ, బీరెల్లి చంద్రశేఖరగుప్తా విచ్చేసి వివిధ రంగాలలో సేవలందిస్తున్న వారికి పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా నేరెల్ల మల్యాద్రి మాట్లాడుతూ.. సమాజసేవకులకు అవార్డులు బహూకరించడం వల్ల వారు సమాజానికి మరింత సేవలు అందిస్తారని పేర్కొన్నారు. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ నేషనల్ చైర్మన్ కొంపల్లి సత్యనారాయణ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజసేవకులను గుర్తించి అవార్డులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు.ఈ సందర్భంగా ఎన్ టి ఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమాశంకర్ గుప్తాని శాలువాతో సత్కరించి అవార్డు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఉమాశంకర్ గుప్తా మాట్లాడుతూ ఈ అవార్డు ప్రధానం చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు.

IMG-20250421-WA0077

Read Also రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?