ఘనంగా ఈస్టర్ పండుగ.. షాలోమ్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

ఘనంగా ఈస్టర్ పండుగ.. షాలోమ్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు

హుజూర్ నగర్, ఏప్రిల్ 20, (క్విక్ టుడే న్యూస్) :- ఈస్టర్ వేడుకను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఏసుక్రీస్తు శిలువపై మరణించి తిరిగి మూడో రోజు పునరుత్థానం చెందడాన్ని పురస్కరించుని క్రైస్తవులు ఈస్టర్ వేడుకను జరుపుకుంటారు. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలోని షాలోమ్ చర్చిలో ఆదివారం ఈస్టర్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేక గీతాలు ఆలపించి ఏసు క్రీస్తును ఆరాధించారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్, సీఎస్ఐ సాగర్ గ్రూప్ చైర్మన్ రెవ. జిజె కాంతారావు భక్తులకు బైబిల్ సందేశాన్ని బోధించారు. ప్రజల పాపాలను కడిగివేసేందుకు తన రక్తాన్ని చిందించి శిలువపై ప్రాణాలొదిలి, మూడో దినమున సజీవుడై లేచి తిరిగి తన తండ్రియైన యెహోవా వద్దకు చేరుకున్నాడని తెలిపారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఏసుక్రీస్తు మార్గాన్ని అనుసరించాలని శాంతి, సమానత్వం, సమాధానంతో జీవించాలని సూచించారు. ఈస్టర్ సందర్భంగా చర్చిని విద్యుత్ కాంతులు, పూలతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. ఎంతో శ్రమకోర్చి చర్చిని అలంకరించిన దారా అనిల్ కుమార్, అందుకు సహకరించిన చర్చి యూత్ ను పాస్టర్ తో పాటు సంఘ సభ్యులు అభినందించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా చర్చి సెక్రెటరీ పీ. డానియల్, ట్రెజరర్ ఎన్. స్వాతి అన్ని ఏర్పాట్లు చేశారు.

IMG-20250420-WA0106

Read Also రెండు దశబ్దముల తర్వాత కలుసుకున్న విద్యార్థునులు

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?