ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశభవిష్యత్తు - టెక్నాలజీ విద్యలో విద్యార్థులు ముందుండాలి

ఉపాధ్యాయుల చేతుల్లోనే దేశభవిష్యత్తు - టెక్నాలజీ విద్యలో విద్యార్థులు ముందుండాలి

పీర్జాదిగూడ‌, ఏప్రిల్ 26 (క్విక్ టుడే న్యూస్‌):-విద్యార్థులకు ఉపాధ్యాయులు మార్గదర్శకులని,  దేశభవిష్యత్తు, నిర్మాణం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, విద్యతోనే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ టీచర్స్ వెల్ఫేర్ అస్సోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వ సభ్య సమావేశం & దశాబ్ది ఉత్సవాలలో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి,ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి, మాజీ మేయర్ జక్క  వెంకట్ రెడ్డి, బోడుప్పల్ బీఆర్ఎస్  అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ విద్యా రంగాన్ని మార్చివేసింది, ఇది ఉపాధ్యాయుల పాత్రను కూడా అభివృద్ధి చేసింది.విద్యార్థులను భవిష్యత్ శ్రామిక శక్తికి అనుగుణంగా సిద్ధం చేయడానికి, ఉపాధ్యాయులు సాంకేతికతను పాఠ్యాంశాల్లో సమర్థవంతంగా అనుసంధానించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి, సాంకేతిక వనరులను ఉపయోగించాలి, మరియు విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపకల్పన చేయడంద్వారా విద్యార్థులు భవిష్యత్తులో విజయవంతమవుతారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి, సింగిరెడ్డి పద్మారెడ్డి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి యూటీఏ ప్రధాన కార్యదర్శి ఆకుల వనజ, కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250426-WA0019

Read Also స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టడం ద్వారా మహిళ సంఘాలకు జీవనోపాధి*

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?