మహిళలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

మహిళలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

తొర్రూరు ఏప్రిల్ 21(క్విక్ టుడే న్యూస్):- మహిళా సాధికారితనే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని, ఆడబిడ్డల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్‌ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు.సోమవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ....రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, ఆడబిడ్డల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మహిళల పేరిట ఇందిరమ్మ ఇండ్లు, స్వయం సహాయక సంఘాలకు రుణాలు, సన్న బియ్యం, గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే వంట గ్యాస్ వంటి పథకాలు ఎన్నో మహిళల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలే ముందుండి కాంగ్రెస్ ప్రతినిధులను గెలిపించాలని కోరారు.మహిళలు రాజకీయాల్లో రాణించాలని, వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో మహిళా కార్యకర్తలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గం లో మహిళ ఎమ్మెల్యేగా ఉందని, మహిళలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని తెలిపారు.ఈ సమావేశంలో  మహిళా కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షరాలు పింగిలి ఉష, మండల అధ్యక్షురాలు బూర్గుల ప్రశాంతి,మాజీ కౌన్సిలర్ దొంగరి రేవతి,మహిళ గ్రామ, పట్టణ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20250421-WA0050

Read Also తెలుగు వృత్త్యంతర శిక్షణలో జ్ఞాన దర్శిని పుస్తక సమీక్ష

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?