తొర్రూరు ట్యాంక్ బండ్,చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలి

తొర్రూరు ట్యాంక్ బండ్,చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ల పనులు వేగవంతం చేయాలి

పాలకుర్తి ఏప్రిల్ 22:-పాలకుర్తి నియోజకవర్గంలో ఎండాకాలంలో త్రాగునీటి కొరత లేకుండా చూడాలని.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్, మున్సిపల్,ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల అధికారులతో సిఈతో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యంగా ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.తొర్రూరు ట్యాంక్ బండ్ పనులపై ఇప్పటి నుంచే నీటి నిల్వలను కాపాడుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని, అవసరమైన ప్రాంతాలకు నీటి సరఫరా నిరవధికంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.చెన్నూరు,పాలకుర్తి రిజర్వాయర్ల నీటి నిల్వల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. వచ్చే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి చుక్కనీటిని ఉపయోగకరంగా మార్చేలా చూడాలన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ... ఎండాకాలంలో ప్రజలకు త్రాగునీటి తాకిడి లేకుండా ఉండేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చెప్పారు. ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితో త్రాగునీటి సమస్యను అధిగమిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే కాలువల పూడికతీత సమస్య ప్రధానంగా ఉందని, పలు ప్రాంతాల్లో కాలువల్లో భారీగా పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం సక్రమంగా జరగడం లేదని,దీంతో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.పైరుల సాగు నిలిచిపోకుండా ఉండేందుకు కాలువల పూడికతీత పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిన్నకాల్వల విషయంలో స్థానిక అధికారులతో కలిసి పంచాయతీలు,గ్రామస్థాయి సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.శాఖల వారీగా అధికారులు త్రాగునీటి ప్రాజెక్టుల అమలు,నీటి నిల్వల వినియోగ ప్రణాళిక,కాలువల పూడిక తొలగింపు తదితర అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో నివేదిక ద్వారా వివరించారు. మున్సిపల్ అధికారులు పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యే ఆరా తీశారు.

IMG-20250422-WA0017

Read Also అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను ఏరివేయాలి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?