Nalgonda : ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా పారిశుధ్య మహిళ కార్మికులకు సన్మానం

Nalgonda : ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా పారిశుధ్య మహిళ కార్మికులకు సన్మానం

Nalgonda : నల్లగొండ జిల్లా ప్రతినిధి, మార్చి 8 (క్విక్ టుడే) : ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా క్లీన్ హోమ్ - గ్రీన్ హోమ్  ప్రోగ్రాం ఆర్గనైజర్ ఆదిమల్ల మణిరాజు ఆధ్వర్యంలో48వ వార్డ్ కౌన్సిలర్ యామ కవితా దయాకర్  సహకారంతో వార్డులో పనిచేయుచున్న మహిళ పారిశుద్ధ్య కార్మికులకు  వార్డులోని మహిళా మణులకు గొప్ప సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి, 30  మంది మహిళలను ఘనంగా సన్మానించనైనది.  ఈ సందర్భంగా 48 వ వార్డు కౌన్సార్ కవిత దయాకర్  గారు  మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్త్రీ లేనిదే మానవ జీవితం లేదు  స్త్రీ అమ్మగా, చెల్లిగా, భార్యగా,  వారి ప్రేమను పంచుతూ కుటుంబము మరియు  ఆదర్శవంతమైన సమాజంమును  నిర్మించుటలో ప్రముఖ పాత్ర పోషించేదే స్త్రీ అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీని మనం గొప్పగా గౌరవించుకొని సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆ క్రమంలోనే ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అదిమల్ల మణిరాజు సారధ్యంలో మా 48వ  వార్డులోని పారిద్య కార్మికులను,  ఇతర మహిళలను గొప్పగా సన్మానించనైనది.  

 

Read Also ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందజేత 

అలాగే అదిమల్ల. మణిరాజు  మాట్లాడుతూ సృష్టిలో సగభాగం స్త్రీ అయినప్పటికిని పూర్వం  పురుషాధిక్య సమాజంలో అణచివేయబడ్డప్పటికిని విద్యా అవకాశాలను వినియోగించుకొని గొప్పగా ఎదిగి అన్ని రంగాలలో వారి ప్రతిభను చాటుతూ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించుచున్నటువంటి మహిళా మణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు  తెలియజేస్తున్నాను  ఈ సందర్భంగా వారి సేవలను గుర్తించి వారిని గొప్పగా సన్మానించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వీరితోపాటు మా అమ్మను కూడా సన్మానించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను.  ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య మహిళా కార్మికులు,  అంగన్వాడీ టీచర్లు ఆయాలు,  ఆశా వర్కర్లు,  వార్డులోని మహిళామణులు పాల్గొన్నారు.

Read Also లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?