విద్యార్థినికి విమాన ప్రయాణం కల్పించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

విద్యార్థినికి విమాన ప్రయాణం కల్పించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి

మిర్యాలగూడ, మే 07 (క్విక్ టుడే న్యూస్):- మాడుగులపల్లి మండలానికి చెందిన కస్తూర్బాగాంధీ విద్యార్థిని పి.ప్రసన్న పదవ తరగతిలో 600 గాను 563 మార్కులు సాధించింది. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రసన్న 17/05/2025 నాడు విమాన ప్రయాణం చేయనుంది. గతంలో కేజీబీవీ పాఠశాలలు సందర్శించిన సమయంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి విమాన ప్రయాణ హామీని ఇచ్చారు. మాడుగులపల్లి మండలం కేజీబీవీ పాఠశాలకు చెందిన పి.ప్రసన్న అత్యధిక మార్కులు సాధించడంతో, హైదరాబాదు నుండి విశాఖపట్నం వరకు విమాన ప్రయాణానికి సంబంధించిన టికెట్స్ బుధవారం కలెక్టరేట్ ఆఫీస్ నందు విద్యార్థిని పి.ప్రసన్నకు మరియు విద్యార్థిని తో పాటు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత కు టికెట్లు అందజేశారు. ఈ విషయమై కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థినికి అత్యధిక మార్కులు రావడం, కలెక్టర్ ఇలా ట్రిపాఠీ విమాన ప్రయాణానికి టికెట్స్ అందించడం చాలా ఆనందంగా ఉంది. అని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బిక్షపతి, సబ్-కలెక్టర్ నారాయణ అమిత్, మాడుగులపల్లి కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ సునీత, విద్యార్థిని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

IMG-20250507-WA0053

Read Also డెంగ్యూ వ్యాధి జాతీయ దినోత్సవ అవగాహన ర్యాలీ 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?