Maganta Raghava: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్ గా మాగంట రాఘవకు అనుమతి
ఈ సౌత్ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్, అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కవిత భాగస్వాములుగా ఉన్నట్లు వెల్లడిస్తోంది. సమీర్ మహేంద్రుకు చెందిన ఇండోస్పిరిట్స్ కంపెనీలో రాఘవ్‌కు 32.5 శాతం వాటాలు ఉన్నట్లు ఈడీ విచారణలో తేలింది. మద్యం విధానం రూపకల్పనలో మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఆధారాలు సేకరించింది. ఢిల్లీలోని అతడి నివాసంలో కూడా సమావేశాలు జరిగాయని, వాటికి అరుణ్ పిళ్లై, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు పాల్గొన్నట్లు ఈడీ స్పష్టం చేసింది. మాగుంట నివాసంలో సీబీఐ, ఈడీ సోదాలు కూడా నిర్వహించాయి. ఆయా హోటళ్లలో జరిగిన సమావేశాలు, భాగస్వామ్యం, సౌత్ గ్రూపు వ్యవహారాలు, ఇతర నిందితులతో సంబంధాలు, ముడుపుల చెల్లింపు, నగదు లావాదేవీలు వంటి అంశాలపై ఈడీ పలు మార్లు ప్రశ్నించింది.
గతంలో మాగుంట రాఘవ్ రెడ్డి చాలా కాలం పాటు ఈడీ కేసులో జైల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి వైఎస్ జగన్ టిక్కెట్ నిరాకరించడం, పార్టీ వ్యవహారాల్లో పట్టించుకోకపోవడం వల్ల ఆయన వైసీపీకి రాజీనామా సమర్పించారు. టీడీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డి ఈ సారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. కాగా ఇంత వరకూ ఆయన చంద్రబాబును కలువలేదు. గతంలో ఓ సారి టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. మాగుంట కుటుంబం ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉంటున్నా.. ఇప్పటి వరకు వారి కుటుంబంపై ఎలాంటి స్కాం ఆరోపణలు రాలేదు. ఇప్పుడు లిక్కర్ స్కాం కేసు వారి మెడకు చుట్టుకుంది. పెద్ద మొత్తంలో మాగుంట కుటుంబానికి మద్యం కంపెనీలు ఉండగా ఇప్పుడు స్కాంలో ఇరుక్కుపోయింది.