Nalgonda : మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం
నల్లగొండ విజయసంకల్ప సభలో ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్
On
Nalgonda : నల్గొండ జిల్లా ప్రతినిధి, మార్చి1 (క్విక్ టుడే) : గత 10 ఏళ్లులగా దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం బలపర్చాలని, ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో క్లాక్కులను సెంటర్లో కృష్ణమ్మ విజయసంకల్ప సభ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సభకు ఈయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడతారన్నారు.
దేశవ్యాప్తంగా 400 సీట్లు బిజెపికి వస్తాయని తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు బిజెపికి వచ్చే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి అన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పదివేలుగా తెలంగాణ ఉద్యమం పేరుతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అత్యధిక స్థానాలు గెలవడం ఖాయం అన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
