CM Revannth Reddy : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం.. 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్
On
హైదరాబాద్, క్విక్ టుడే : తెలంగాణ కేబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించింది. ఈ. కేబినెట్ సమావేశంలో భాగంగా 16 బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముదిరాజ్, మున్నూరు కాపు, యాదవ, పద్మశాలి, మేరు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఈబీసీలకు రెడ్డి కార్పొరేషన్‌తో పాటు వైశ్య, సంత్‌సేవాలాల్, మైనార్టీ, కార్పొరేషన్ ఏర్పాటుకు తీర్మానించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలోనూ తెలంగాణ కేబినెట్ చర్చించినట్లు సమాచారం. ఇటీవల హైకోర్టు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ పేర్లను గెజిట్ నుంచి తొలగించాలని వెల్లడించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో మరోసారి వీరి పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్ తమిళిసైకి పంపించాలని మంత్రివర్గం తీర్మానించినట్లు తెలుస్తోంది.
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...