శివ్వంపేట ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్
On
శివ్వంపేట, క్విక్ టుడే న్యూస్: శివ్వంపేట మండలంలోని ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. నిధుల కొరత వల్ల పనులు ఆగిపోగా, కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ పులిమామిడి స్రవంతి నవీన్ గుప్త తన స్వంతంగా రూ.9 లక్షలు ఖర్చు చేసి పాఠశాలను పూర్తిచేశారు. డోర్లు, ఫ్యాన్లు, గ్రీన్ బోర్డ్స్, బాలల పెయింటింగ్స్‌తో పాఠశాలను మోడల్ స్కూల్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఈ కృషిని కలెక్టర్ అభినందిస్తూ నవీన్ గుప్తకు శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్శనలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి, డిప్యూటీ కలెక్టర్ నగేష్, ఆర్డీవో, ఎమ్మార్వో తదితర అధికారులు, కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...