క్రీడలతోనే మానసిక వికాసానికి దోహదం...

క్రీడలతోనే మానసిక వికాసానికి దోహదం...

తొర్రూరు ఏప్రిల్ 21(క్విక్ టుడే న్యూస్):- క్రీడలు మనో వికాసానికి దోహదం చేసి శారీరక దృఢత్వానికి తోడ్పడుతాయని తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో గత రెండు రోజులుగా కీ.శే అనుమాండ్ల మాధవ రెడ్డి జ్ఞాపకార్థం వారి మనవడైన అనుమాండ్ల తిరుపతి రెడ్డి ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఆహ్వానిత వాలీబాల్ క్రీడోత్సవాల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు స్నేహాన్ని పెంపొందిస్తాయని, శారీరక మనో వికాసాన్ని కలిగిస్తాయని, విద్యార్థులందరూ కూడా క్రీడల పైన దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రీడలను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డిలు ప్రారంభించినట్లు తెలిపారు.ఎంప్లాయిస్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గొడిశాల నగేష్ అధ్యక్షతన ముగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతిని రఘునాథపల్లి, ద్వితీయ మేడారం తృతీయ కొత్తగూడ,చతుర్ద బహుమతిని తాడ్వాయి క్రీడాకారులు గెలుచుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రెటరీ వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి,సూరం ఉపేందర్ రెడ్డి, కొండం జనార్దన్, ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెల్ల లక్ష్మీనారాయణ,వాలీబాల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్కాల  ఆది రెడ్డి, నరెడ్ల శ్రీధర్,ఎంప్లాయిస్ వాలీబాల్ అసోసియేషన్  ప్రతినిధులు దేవులపల్లి శంకర్, కారంపూడి సురేష్,రామచేంద్రం, నవీన్, సతీష్ యాకయ్య  తదితరులు పాల్గొన్నారు.

IMG-20250421-WA0048

Read Also భూ భారతితో రైతులకు మేలు..:- రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?