క‌శ్మీర్ ఉగ్ర మూకలు దాడికి నిరసనగా బోడుప్ప‌ల్‌లో కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన

క‌శ్మీర్ ఉగ్ర మూకలు దాడికి నిరసనగా బోడుప్ప‌ల్‌లో కాంగ్రెస్ కాగడాల ప్రదర్శన

బోడుప్ప‌ల్‌, ఏప్రిల్25 (క్విక్ టుడే న్యూస్‌):-క‌శ్మీర్లో పహల్గాం టూరిస్టులపై ఉగ్రదాడిని ఖండిస్తూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శనలో మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి  పాల్గొనడం జరిగింది. ఉగ్ర మూకలు  దాడిని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ బొమ్మ వరకు దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన చేపట్టారు. ప్రశాంతంగా ఉన్న క‌శ్మీర్ లోయలో ఉగ్రముకలు చేసిన దాడిలో అమాయకులు మృతి చెందారు మృతి చెందిన వారి  కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మేయర్ అజయ్ యాదవ్ కోరారు. దొంగ దెబ్బతీసిన ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కొట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

IMG-20250425-WA0063

Read Also "ఏప్రిల్ 28న చలో నల్గొండ"... పూలే, అంబేద్కర్ జనజాతర 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?