భూభారతి చట్టంపై మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అవగాహన
On
శివ్వంపేట, క్విక్ టు డే న్యూస్: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంపై రైతులు పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఈ చట్టంలోని అంశాలపై గ్రామాలలో విస్తృతంగా చర్చిస్తూ, తోటి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. శనివారం శివ్వంపేట మండలం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సులలో అదనపు కలెక్టర్ నగేష్ గ్రంథాలయ చైర్మన్ చిలుమల సుహాసిని రెడ్డి, నర్సాపూర్ ఆర్డిఓ మహిపాల్ రెడ్డి,తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూ భారతి చట్టం ద్వారా రైతులకు.చేకూరే ప్రయోజనాల గురించి కలెక్టర్ ఒక్కో అంశం వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూ భారతి (ఆర్ ఓ ఆర్) చట్టం - 2025 జనవరిలో గెజిట్ రూపంలో వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 14న సమగ్ర అంశాలను పొందుపరుస్తూ చట్టాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. భూ సమస్యలు కలిగిన రైతులు ఏడాది కాలంలోపు భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఈ సదస్సులలో స్థానిక అధికారులు తాసిల్దార్ కమలాద్రి, పిఎసిఎస్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవో నాగేశ్వర్ గుప్తా , డిప్యూటీ ఎమ్మార్వో షఫీ, తెలంగాణ రైతు రక్షణ సమితి గౌరవ అధ్యక్షులు అక్క మల్ల మైసయ్య యాదవ్, సహాయకులు మిరియాల చంద్రశేఖర, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవీన్ గుప్తా, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చింతల కర్ణాకర్ రెడ్డి, మండల మాజీ సర్పంచుల పోరం అధ్యక్షులు లావణ్య మాధవరెడ్డి, సేవ రత్న అవార్డు గ్రహీత బండారి గంగాధర్, మాజీ జెడ్పిటిసి లక్ష్మీ కాంతారావు కమలాపూర్ సింగ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి , రైతులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...