Dandempalli Sattaiah,: గ్రామీణ భారత్ బంద్ విజయవంతం చేయాలి
-వెల్ఫేర్ బోర్డు రక్షణ కోసం ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె
1998 సెస్సు చట్టం ప్రకారం సెస్సునిధులను సమర్ధవంతంగా వసూలు చేసి, వాటిని కొత్త సంక్షేమ పథకాల కోసం నిర్మాణరంగ కార్మికులకు ఖర్చు చేయాలన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను కార్మికులకు వెంటనే ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాలకు తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖలో బ్రోకర్ల వ్యవస్థను నిర్మూలించాలన్నారు. అర్హులైన కార్మికులకే నష్టపరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు పెంచాలన్నారు, సహజ మరణానికి ఐదు లక్షలకు పెంచాలన్నారు. ప్రసూతి పెళ్లి కానుకకు లక్ష రూపాయలకు పెంచాలన్నారు. వెల్ఫేర్ బోర్డు నుండి అక్రమంగా దారి మళ్లించిన 1005 కోట్లరూపాయలను మరియు బీసీ బందుకు కేటాయించిన 250 కోట్లను తిరిగి బోర్డులో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న ALO, ACL, DCL, జూనియర్ సీనియర్ అసిస్టెంట్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 16 సమ్మె సందర్భంగా పట్టణంలోని అన్ని అడ్డాలలో విస్తృతంగా 12 13 14 తేదీలలో కరపత్రాల పంపిణీ చేయాలని, 14 వ తేదీ సాయంత్రం బైక్ ర్యాలీ 16 సమ్మె సందర్భంగా పెద్ద గడియారం సెంటర్లో జరిగే సభలో భవనిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ (సిఐటియు ,ఏఐటీయూసీ, బి ఆర్ టి యు ,ఐ ఎన్ టి యు సి) నాయకులు అద్దంకి నర్సింహ్మ, గుండె రవికుమార్ ఎనమల్ల వెంకటేశం కత్తుల సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.