మేడిపల్లి, ఏప్రిల్ 23 (క్విక్ టుడే న్యూస్):-పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని మేడిపల్లి 62/1 సర్వేనెంబర్ లో గత బీఆర్ ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీదవాళ్లకు ప్రభుత్వ పట్టాలు ఇచ్చింది ఇచ్చిన ప్రభుత్వ పట్టాలను అమాయకులైన నిరుపేదల నుండి కొంతమంది ల్యాండ్ మాఫియా మరియు అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న రాజకీయ నాయకులతో కలిసి బలవంతంగా గుంజుకున్నారని, తమ సామాన్లు బయటపడేసారని కొంతమంది బాపూజీ నగర్ బాధితులు కలిసి గత సంవత్సర కాలంగా పోరాడుతున్న విషయం మనకు తెలిసిందే! దాంతో తమకు జరిగిన అన్యాయాన్ని, జరుగుతున్న దౌర్జన్యాలను స్థానిక పీఎంసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత బద్రు నాయక్ ని బాధితులు ఆశ్రయించారు ఆమె చొరవ తీసుకొని స్వయంగా స్థానిక మేడిపల్లి ఎమ్మార్వో గారిని, ఆర్డీవో గారిని, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ల్యాండ్ మాఫియా పై, వారికి సహకరిస్తున్న రాజకీయ నాయకుల పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, గుంజుకున్నా పట్టాలు తిరిగి ఇప్పించి అమాయకులైన నిరుపేద గిరిజనులను ఆదుకోవాలని పలుమార్లు ఫిర్యాదు చేశారు కానీ నేటికీ ఎటువంటి స్పందన రాకపోవడం, ల్యాండ్ మాఫియా రాజకీయ నాయకుల బెదిరింపులు రోజు రోజుకు ఎక్కువ అవడంతో స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదుచేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారి నుంచి కూడా సరైన స్పందన కరువు అవడంతో ,ఎటువంటి సమాధానం రాకపోయేసరికి తిరిగి తిరిగి విసిగి వేసారి మహిళ నాయకురాలు శ్రీలత బద్రు నాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించి బాధితుల సమస్యను జాతీయ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు తమకు భద్రత కరువైందని, తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు గుంజుకున్నారని ఫిర్యాదు చేస్తే ఎమ్మార్వో ,ఆర్డీవో జిల్లా కలెక్టర్ కనీసం పట్టించుకోవడంలేని బాధితులు బాధను కమిషన్ ముందు వ్యక్తపరచడంతో దీంతో వారు వెంటనే స్పందించి గత మార్చి .2025 నెలలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి రాచకొండ కమిషనర్ గారికి జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసి నెల రోజులలో అమాయక గిరిజనబాధితుల ఫిర్యాదుకు ఎందుకు స్పందించలేధో తమకు వెంటనే వివరణ ఇవ్వాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. కానీ నెల రోజులు దాటిన కానీ మేడ్చల్ జిల్లా కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్ గారి నుండి ఎటువంటి వివరణ రాకపోవడంతో ఈనెల 21.04.2025 తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారికి, రాచకొండ పోలీస్ కమిషనర్ గారికి విచారణ సమన్లు జారీ చేసి 06.05.2025 న ఢిల్లీలోని జాతీయ ST కమిషన్ ముందు తప్పక స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని లేనిచో చట్టపరమైన చర్యలు ఉంటాయని ఈ సమన్లలో కోరింది. ఈ సందర్భంగా శ్రీలత బద్రు నాయక్ గారు ఈరోజు బాపూజీ నగర్ లో బాధితులతో కలిసి పర్యటించి వారికి ధైర్యం చెప్పి బాపూజీ నగర్ లో పేద ప్రజల పట్టాలు గుంజుకున్న ల్యాండ్ మాఫియాను, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకుల భూ అక్రమణాల బండారం, కోట్లు సంపాదించుకున్న వైనాన్ని బయటపెడతానని తప్పక పేద ప్రజల తరఫున పోరాడుతానని ఈ పోరాట మార్గంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమాయక గిరిజన ప్రజల తరపున పోరాడడానికి ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవడానికి అయినా తాను సిద్ధమని ఈ సందర్భంగా శ్రీలత భద్రు నాయక్ గారు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాధితురాళ్లు బద్రి, సౌందర్య, పద్మ, వసంత, పత్తిభాయి మరియు బాధితుల కుటుంబ సభ్యులు కుటుంబ మరియు స్థానిక బంజారా నాయకులు గూగులోతు శ్రీనివాస్ నాయక్, రవి నాయక్, సురేందర్ నాయక్ మరియు సుమన్, నరేందర్ మరియు అనేకమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
