అరోరా యూనివర్సిటీలో ఫీజుల వేధింపులు ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఫీజులకు రూ. 50 వేల డిమాండ్ ..
On
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరోరా యూనివర్సిటీలో యాజమాన్యం వేధిస్తున్నట్లు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఫీజుల కోసం రూ. 50 వేలు డిమాండ్ చేస్తున్నారని విద్యార్థులు సోమవారం యూనివర్సిటీ క్యాంపస్ లో ఎంబీఏ, ఎంసీఏ ఫైనల్ విద్యార్థులు ఆందోళన చేశారు. జాయినింగ్ సమయంలో తమకు ఎక్స్టర్నల్ కోర్సులకు ఫీజులు ఉంటాయని చెప్పలేదని, ఇప్పుడు తమకు ఫీజులు చెల్లించాలంటూ మోసం చేస్తున్నట్లు వారు ఆరోపించారు. మరో మూడు నెలలలో కోర్సులు పూర్తికానుడంతో ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లను ఆపుతామని యాజమాన్యం వేధిస్తుందని పేర్కొన్నారు. అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి ఒక్కో సబ్జెక్టుకు రూ.10 వేలు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. ఇలా మొత్తం 8 సెమిస్టర్ల నుంచి విద్యార్థులకు అధిక మొత్తంలో ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. విద్యార్థులు పెద్ద మొత్తంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యాజమాన్యం తీరుపై నిరసన చేశారు. యాజమాన్యం స్పందించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. రేపు యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరసన పరోరా యూనివర్సిటీ అనుసరిస్తున్న విధానంపై విద్యార్థులు మండిపడుతున్నారు. పరీక్ష ఫీజుల పేరుతో తమను మోసం చేసిన యాజమాన్యం తక్షణమే స్పందించి ఏదైనా రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం యూనివర్సిటీ గేటు ఎదురుగా రోడ్డుపై నిరసన చేపట్టినట్లు తెలిపారు. తమను మోసం చేసిన యూనివర్సిటీ పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags:
Latest News
23 Apr 2025 13:59:30
పెబ్బేర్, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్): -ఇంటర్మీడియట్ ఫలితాలలో మోడల్ కళాశాల పెబ్బేర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని సాధించి సత్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...