Womens day :మణుగూరు కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
On
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, క్విక్ టు డే : మణుగూరు పట్టణంలోని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో గురువారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మణుగూరు కోర్టు జడ్జి ఎం.వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలు ఒంటరి వాళ్ళు కాదు, మహిళల రక్షణ కోసం చట్టం, న్యాయస్థానాలు ఉన్నాయని అందుకోసం ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
మహిళలలు ధైర్యంగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ మహిళలు ఈర్షాద్వేషాలు వదిలి అభివృద్ధి సాధించాలన్నారు. యువతులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నిరుపేదలకు ఉచిత న్యాయ సేవలు అందించేందుకు ప్రత్యేక లాయర్లు ఎప్పుడు ఉంటారని, పిల్లల్ని సన్మార్గంలో పెట్టడంలో తల్లి పాత్ర కీలకంగా ఉండాలని కోరారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మన దేశంలో మహిళలకు అందరికీ ఓటు హక్కు ఉంది. కానీ కొన్ని ఇతర దేశాల్లో ఇప్పటికి మహిళలకు ఓటు హక్కు లేకపోవడం దురదృష్టకరమని, అందుకే మహిళలు రాజకీయంగా ఎదగాలి అని కోరారు. ఈ వేడుకల్లో బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళ, పురుషుల న్యాయవాదులు పాల్గొన్నారు..
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...