TS Hight Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ షాక్.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ నియామకం గెజిట్‌ కొట్టివేత  

TS Hight Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ షాక్.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ నియామకం గెజిట్‌ కొట్టివేత  

TS Hight Court : తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్‌ షాక్ తగిలింది. శాసనమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమీర్‌ అలీఖాన్‌ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ నియామకాలను రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్‌తో పాటు కాంగ్రెస్‌ ప్రభుత్వ నియామకాలపై దాఖలైన పిటిషన్‌పై తీర్పులు వెలువరించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ నియామకాలను హైకోర్టు ర‌ద్దు చేస్త్నున్న‌ట్ల ప్ర‌క‌టించింది. ఎమ్మెల్సీలుగా కోదండరాంతో పాటు అలీఖాన్‌ల‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. దీనిపై జనవరి 30వ తేదీన హైకోర్టు స్టే విధించింది. కోదండరాం , అలీఖాన్‌ల నియామకాలు రద్దుతో పాటు గతంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా కీలక తీర్పు వెలువరించింది. 

గత ఏడాది గవర్నర్‌ కోటా కింద‌ ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను ప్రతిపాదిస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేయ‌గా వారి పేర్ల‌ను గవర్నర్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత కోదండరాం, అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించ‌గా గవర్నర్ ఆమోదించారు. ఈ వివాదం కోర్టు పెండింగ్‌లో ఉండగా కొత్త‌గా నియామకాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరో పిటిషన్ దాఖలైంది. కాగా రెండు వేర్వేరు పిటిషన్లపై గురువారం తీర్పు వెలువడింది. ఎమ్మెల్సీల నియామకాలను రద్దు చేయడానికి గవర్నర్‌‌కు అధికారం లేదని, క్యాబినెట్‌కు తిప్పి పంపాలని స్పష్టం చేసింది. మరో పిటిషన్‌లో కోదండరాం, అలీఖాన్  నియామకాలను రద్దు చేసింది. కేబినెట్ ఆమోదం ద్వారా ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌కు సిఫార‌సు ఆదేశించింది. శ్రవణ్, సత్యనారాయణల నియామకంపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే కేబినెట్‌కు తిప్పి పంపాలే త‌ప్ప‌, తిరస్కరించే అధికారం గవర్నర్‌కు లేదని తెలిపింది. 

Read Also టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

ఈ ఏడాది జనవరి 30వ తేదీన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఆదేశాలు వెలువ‌డే వరకు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం చేయొద్ద‌ని ఆదేశించింది. ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ల‌ను గవర్నర్ తమిళి సై గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించారు. ఆ నియామకాన్ని వ్య‌తిరేకిస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయొద్ద‌ని వారికి ఉత్తర్వులు ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ ఆమోదించింది. కాగా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై  వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు. ఆ త‌ర్వాత‌ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో కొత్త వారిని గ‌వ‌ర్న‌ర్ ఆమోదించారు.  ఆర్టికల్ 171 ప్రకారం గ‌త ప్ర‌భుత్వం త‌మ పేర్ల‌ను  ఎమ్మెల్సీలుగా ప్ర‌క‌టిస్తే గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డాన్ని దాసోజు శ్ర‌వ‌ణ్‌, స‌త్య‌నారాణ‌య హైకోర్టులో స‌వాల్ చేశారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు ఎలా ఉండ‌బోతుంద‌నేది ఆసక్తికరంగా మారింది. కోదండరాం, అలీఖాన్‌లకు మళ్లీ ప్రతిపాదిస్తారా లేదా వేరేవారికి  అవకాశం ఇస్తారా అనేది త్వ‌ర‌లోనే తేలిపోనుంది. 

Read Also ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి యశస్విని ఝాన్సీ రెడ్డిలు

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?