లెనిన్ ఆశయ సాధనకై పోరాడాలి

లెనిన్ ఆశయ సాధనకై పోరాడాలి

తొర్రూరు ఏప్రిల్ 22(క్విక్ టుడే న్యూస్:-  కామ్రేడ్ లెనిన్ ఆశయ సాధనకై పోరాటాలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి ఆలకుంట్ల సాయిలు తెలిపారు. న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం డివిజన్ కేంద్రంలోని అన్నారం రోడ్డులో మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు లెనిన్ జయంతి కార్యక్రమం, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను సాయిలు ఆవిష్కరించారు. మండలంలోని  మాటేడు గ్రామంలో న్యూ డెమోక్రసీ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులు లింగాల లింగాచారి , జాటోత్ బిక్షపతి లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లెనిన్ శ్రామిక వర్గ ప్రయోజనాల కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు.ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కార్మిక రాజ్యాన్ని ఏర్పరచి సోషలిస్టు నిర్మాణ వ్యవస్థకు లెనిన్ పునాదులు వేశారని కొనియాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, పెట్టుబడిదారులకు అనుకూలంగా పాలన సాగిస్తున్నాయని దుయ్యబట్టారు. లెనిన్ స్పూర్తితో ప్రజా పోరాటాల నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటయ్య, రాములు, సోమయ్య, శ్రీనివాస్, గణపతి, మంగీలాల్ , వెంకటేశ్వర్లు, పెంటయ్య, సోమలింగం ,భద్రు వీరన్న, వల్లపు శ్రీకాంత్ లింగాల నరసింహ, వల్లపు సాయిలు, అశోక్, పిల్లల మర్రి శ్రీను, చర్లపల్లి రామ్మూర్తి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250422-WA0039

Read Also రజతోత్సవ సభకు మండలం నుండి భారీ సంఖ్యలో తరలిరావాలి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?