శ్రీ రాగా స్కూల్ వార్షిక పరీక్షల ఫలితాల సందడి.. ముఖ్యఅతిథిగా హాజరైన మల్లవరపు వరప్రసాద్, కవిత
జి కే గ్రాండ్ టెస్ట్,ఫుడ్ పేస్ట్ , అదేవిధంగా బెస్ట్ టీచర్ అవార్డ్, ఇలా వివిధ రక రకాల యాక్టివిటీస్ లో విద్యార్థులు సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి ఆక్టివిటీస్ లో గెలుపొందిన విద్యార్థులకు శ్రీ రాగ స్కూల్ ఆవరణలో బుధవారం మెమొంటోలు, గోల్డ్ మెడల్స్, ఐఐటి మెరిట్ సర్టిఫికెట్స్ అతిధుల చేతుల మీదుగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా ఈ ఫలితాల సంబరాన్ని ఆస్వాదించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ మల్లారపు వరప్రసాద్ మరియు డైరెక్టర్ మల్లారపు కవిత లు హాజరై మాట్లాడుతూ, అలుపెరుగని 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మండలం జిల్లా రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో ఎన్నెన్నో విజయాల వైపు దూసుకెళ్తూ ఎంతోమంది విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేసింది శ్రీ రాగ స్కూల్ అని అన్నారు. డైరెక్టర్ కవిత మాట్లాడుతూ శ్రీరాగా లో చదువుకున్న విద్యార్థులే భవిష్యత్తులో మంచి పొజిషన్ తో ఏదో ఒక సందర్భంలో శ్రీ రాగా కు ముఖ్యఅతిథిగా రావాలన్నది మా కోరిక అని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం2025-26 లో కూడా అత్యధిక సంఖ్యలో విద్యార్థులు శ్రీ రాగా స్కూల్లో జాయిన్ అవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, సర్వే సర్వేశ్వర రావు రాంసింగ్, కౌసర్, నాగమణి, గాయత్రి, అనూష, శోభ రాణి, అయినవి అన్నపూర్ణ హైందవి మహేశ్వరి కవిత జ్యోతిక, హారిక మరియు పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.