పీర్జాదిగూడ‌లో ఎంజాయ్ కి అడ్డాగా.. కేఆర్‌సీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిష‌న్  మొట్ట మొదటిసారిగా మ్యూజిక ల్ వాటర్ ఫౌంటెన్  లేజర్ షో 

పీర్జాదిగూడ‌లో ఎంజాయ్ కి అడ్డాగా.. కేఆర్‌సీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిష‌న్  మొట్ట మొదటిసారిగా మ్యూజిక ల్ వాటర్ ఫౌంటెన్  లేజర్ షో 

పీర్జాదిగూడ‌, ఏప్రిల్ 21 (క్విక్ టుడే న్యూస్‌):-ఎగ్జిబిషన్ లు ఎంజాయ్ కి అడ్డాగా మారుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా ఎగ్జిబిషన్లు న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.. ఇదే త‌ర‌హాలో మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఉప్ప‌ల్ డిపోకు అత్యంత స‌మీపంలో ప్ర‌ధాన రోడ్డుపై ఏర్పాటు చేసిన కేఆర్‌సీ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిష‌న్ న‌గ‌ర‌వాసుల‌ను అబ్బుర‌ప‌రుస్తోంది. భారీ సెట్టింగ్ లతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ అంద‌రినీ ఆకర్షిస్తోంది. మొట్ట మొదటిసారిగా మ్యూజిక ల్ వాటర్ ఫౌంటెన్  లేజర్ షోను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ లో హస్తకళలు, చిత్రలేఖనాలు, సాంకేతిక ఉత్పత్తులు, చిన్న‌పిల్ల‌ల‌కు ఎంజాయ్ చేసేందుకు జాయింట్ వీళ్లు, బోటింగ్‌ త‌దిత‌రాలు ప్రత్యేకంగా నిలిచాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కళాకారులు, వ్యాపారులు తమ ప్రత్యేకమైన ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తు న్నారు. సందర్శకులకు ఇది ఒక విభిన్నమైన అనుభూతిని కలిగిస్తోంది. ప్ర‌తిరోజు సాయంత్రం 5నుంచి 10 గంట‌ల వ‌ర‌కు సంద‌ర్శ‌కుల‌కు అనుమ‌తిస్తున్నారు. ఒక్కొక్క‌రికీ  ప్ర‌వేశ రుసుము రూ.70 చొప్పున వ‌సూలు చేస్తున్నారు. నిత్యం వివిధ పనుల్లో ప్రజలు బిజీ బిజీ గా ఉండే వారి కోసం సాయంత్రం వేళల్లో కుటుంబంతో పాటు పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ కాస్త సేద తీరటానికి ఇది ఎంతో తోడ్ప‌డుతుంది. అస‌లే స‌మ్మ‌ర్ కావ‌డంతో సాయంత్రం ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో ఎంజాయ్ చేయ‌డానికి వీలుంటుంది. వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసే విధంగా వివిధ రకాల జాయింట్ వీల్స్‌, కొలంబోరైడ్స్, బోటింగ్ వంటివి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కుటుంబంతో కలిసి సరదాగా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు.

IMG-20250421-WA0089

Read Also క్రీడలతోనే మానసిక వికాసానికి దోహదం...

మ‌హిళ‌లు, చిన్నారుల‌కు ప్ర‌త్యేకంగా  బ్యాగులు, ఆట‌వ‌స్తువులు, దుస్తులు స‌రియైన ధ‌ర‌ల‌తో నాణ్య‌మైనవి అందుబాటులో ఉన్నాయి. ర‌క‌ర‌కాలైన ఆహార ప‌దార్థాలు, తినుబండారాలు కూడా ఎంజాయ్ చేసేందుకు నిర్వాహ‌కులు సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులో ఉంచారు. మ‌రి ఇంకా ఆలస్యం ఎందుకు..?.. ఎంజాయ్ చేసేందుకు ఇక్క‌డికి వెంట‌నే చేరుకుని సాయంత్రం పూట స‌ర‌దాగా గ‌డిపేయండి.

Read Also ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి జర్నలిస్టులు

IMG-20250421-WA0084

Read Also భూ భారతితో రైతులకు మేలు..:- రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?