MLA Beerla Ilaiah : 27 ఏళ్ల‌ కళను సహకారం చేసిన ఎమ్మెల్యే

179 మందికి ఇళ్ల ప‌ట్టాలు అంద‌జేసిన ప్ర‌భుత్వ విప్‌ బీర్ల‌ ఐల‌య్య‌

MLA Beerla Ilaiah : 27 ఏళ్ల‌ కళను సహకారం చేసిన ఎమ్మెల్యే

MLA Beerla Ilaiah : యాదాద్రి భువ‌న‌గిరి, క్విక్ టుడే :  పేద ప్ర‌జ‌ల కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం రోజున ఆలేరు మండల కేంద్రం గొలనుకొండ లో 62,272 గల సర్వే నెంబర్లలో 10 ఎకరాల 30 గుంటల భూమిలో 27ఏళ్ల కళను సహకారం చేస్తూ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన 179 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాల నివాస స్థలాలను బీర్ల ఐలయ్య గారు పంపిణీ  చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం అనంతరం ఇందిరామ్మ కాలనీగా నామకరణం చేస్తానని అన్నారు,

118 F

Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

ప్రజలకు నాణ్యమైన పరిపాలన అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే 6 గ్యారంటీలోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని అన్నారు. గృహలక్ష్మి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ పై జీరో బిల్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలిపారు. కాలనీ ఏర్పాటు కోసం విద్యుత్ సౌకర్యం, నీటి వసతి కోసం బోర్లు వేయిస్తానని  ప్రజలకు హామీ ఇచ్చారు, ముందుగా లబ్ధిదారులు ఎవరు గృహప్రవేశం చేస్తారో వారికి లక్ష రూపాయలు బహుమతిగా అందజేస్తానని అన్నారు. అనంతరం లబ్ధిదారులు ఎమ్మెల్యేకు హర్షం వ్యక్తం చేస్తూ శాలువాలతో ఘనంగా సత్కరించారు.

Read Also గుండ్లపల్లిలో ధాన్యం గోల్‌మాల్ – సీఓ భర్త పై ఆరోపణలు

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?