తొర్రూరు ఏప్రిల్ 16:- రాజకీయ సన్యాసం తీసుకుంటానని పదేపదే ప్రకటించడం.. మాట మార్చడం మాజీ మంత్రి దయాకర్ రావుకు అలవాటుగా మారిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు హామ్యా నాయక్ అన్నారు.బుధవారం డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తొర్రూరు మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్ తో కలిసి హామ్యా నాయక్ మాట్లాడారు.100 పడకల ఆసుపత్రి, మినీ ట్యాంక్ బండ్ పై దయాకర్ రావు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసి మినీ ట్యాంక్ బండ్,ఆస్పత్రిని నిర్మించకుండా నిర్లక్ష్యం చేశాడని విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ఎర్రబెల్లి పగటి కలలు కంటున్నాడని,ఆయన కలలు కల్లలు గానే మిగిలిపోతాయన్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా గెలవదని,చైర్మన్,వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయం అన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఏ శక్తి ఆపలేదన్నారు.తొర్రూరు ఎంపీపీ, జడ్పిటిసి స్థానాలతో పాటు సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ఎర్రబెల్లిని పాలకుర్తి ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించారని, దయాకర్ రావు ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదని, అభద్రతాభావంతో అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాడన్నారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు.
సన్న బియ్యం పంపిణీ, మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500 లకు సబ్సిడీ గ్యాస్, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, యువ వికాసం పథకం ద్వారా పేదలకు లబ్ధి అందే విధంగా కృషి చేస్తుందన్నారు.రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని, ఝాన్సీ రెడ్డి లను విమర్శించే నైతిక హక్కు ఎర్రబెల్లి దయాకర్ రావు లేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలను మానుకోకపోతే పాలకుర్తి ప్రజలు తగ్గిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్లు కాందాడి అచ్చిరెడ్డి,కంచర్ల వెంకటాచారి,కాంగ్రెస్ నాయకులు మంగళపల్లి రామచంద్రయ్య, జీనుగా సురేందర్ రెడ్డి,దొంగరి శంకర్, రాజేష్ నాయక్, ముద్దం మహబూబ్ రెడ్డి,మిత్తింటి హరీష్, లాక్య నాయక్,సహదేవ్, చిదిరాల రవి, చిన్న కోటయ్య, ప్రవీణ్ నాయక్,హపావత్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
