అచ్చంపేట,మే04,(క్విక్ టు డే న్యూస్ ) :- అచ్చంపేట పట్టణంలో శ్రీశ్రీశ్రీ మహాత్రిపురసుందరి స్వరూపమైన గ్రామ బొడ్రాయి (నాభిశీల)పున:ప్రతిష్ట పూజల సందర్భంగా కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ,దంపతులు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ బిజెపి మాజీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి .భరత్ ప్రసాద్ మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అచ్చంపేటపట్టణంలో గతంలో ఎప్పుడూ లేనంత మంది ప్రజలు, భక్తులు ,మహిళలు ఈ కార్యక్రమంలో హాజరు కావడం విశేషం పూర్వం ఎప్పుడో జరిగిన ఈబొడ్రాయినాభిషిల ను కాలక్రమేనా రోడ్డు క్రిందకి వెళ్లి కృంగి పొయి న బొడ్రాయి ని తిరిగి ప్రత్యేక స్థానంలో పున ప్రతిష్టించడం ఆపద సమయాల్లో గ్రామ దేవతల (కానరాని) అదృశ్య శక్తులు గ్రామ ప్రజలను కాపాడుతాయని ప్రజలు, భక్తులం దరిప్రగాఢ నమ్మకం ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు అచ్చంపేట ఆడబిడ్డలు వేరే ప్రాంతాలలోసెటిలైన అచ్చంపేట ప్రజలు భారీగా తరలి వచ్చారు. బొడ్రాయి పోచమ్మ నూతన విగ్రహ నిర్మాణ కమిటీ గార్లపాటిశ్రీనివాసులు భక్తులకు ఎలాంటిఅసౌకర్యాలు కలగకుండా భారీ అన్నప్రసాద కేంద్రాలు భగం తుని కార్యక్రమాలను కూర్చొనివీక్షించడానికి నీడ వచ్చే టెంట్లు, దర్శనంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండాఉండేలాచూసుకున్నారు. ఆదివారంఉదయం పది గంటల పది నిమిషాలకుబొడ్రాయి పోచమ్మ విగ్రహాలపునప్రతిష్ట కార్యక్రమంవంశీకృష్ణ దంపతులు, గార్లపాటిశ్రీనివాసులు,వేదపండితులు మూలమల్ల వెంకట శాస్త్రి, ఉదయ్ శాస్త్రిల బృందం తో కమిటీ వాలంటీర్ల చేతులమీదుగా యంత్ర, మంత్ర, తంత్ర , ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్టించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు తీసుకొని పోచమ్మ వారికిసమర్పించారు. విగ్రహ ప్రతిష్ట అనంతరంఅచ్చంపేట పట్టణ ప్రజలు తమ ఇంట్లో ఎంతో భక్తిశ్రద్ధలతోబోనాలు తయారు చేసి పోచమ్మ బొడ్రాయి లకు బోనాలతో కుంభం పోసి తమ మొక్కులుతీర్చుకున్నారు. గ్రామంలో ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాల అలంకరణ అందర్నీ ఆకట్టుకుంది అలాగే యజ్ఞ మండపము పోచమ్మ నూతన ఆలయం బొడ్రాయి వేదిక ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి. అచ్చంపేట రోడ్లు మొత్తం ట్రాఫిక్ జామ్ లతో కిలో మీటర్ల మేరకుజనసంద్రంతోకిటకిటలాడాయి. అచ్చంపేట డిఎస్పి శ్రీనివాస్ సిఐ రవీందర్ ఎస్సై రమేష్ ల ఆధ్వర్యం లో పట్టణంలో ట్రాఫిక్ జామ్,ఎలాంటి అసౌకర్యాల కు గురి కాకుండా శాంతిభద్రతలను కాపాడుతూ భారీగా పట్టణం మొత్తం బందోబస్తు ఏర్పాటు చేశారు.
అదే విధంగా ఈ కార్యక్రమానికి అచ్చంపేట పట్టణం లోని అన్ని కుల సంఘాల నుండి భారీగా విరాళాలు అందాయనిపోచమ్మ బొడ్రాయి పునర్నిర్మాణ కమిటీ తరపున వారికిధన్యవాదాలుతెలియజేస్తున్నానని శ్రీనివాసులు అన్నారు.ఈ కార్యక్రమంలో గార్లపాటిశ్రీనివాసులు, రఘురాం, గౌరీ శంకర్, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, ఆకుల వెంకటేష్, భ్రమరాంబ టెంపుల్ అధ్యక్షుడు పోకల శ్రీధర్, కే వెంకటేష్, మాధవరావు, ఎం బాలాజీ, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
.jpg)